
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్:-ఆపదలో ఉన్న పేదలకు చేయూతనిచ్చేందుకు కృషి చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గo చైతన్యపురి డివిజన్ గణేష్ పురి కాలనీ కి చెందిన గౌరవ్ గౌడ్(24) గత కొన్ని రోజులుగా వెన్నుముక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వారి కుటుంబసభ్యులు ఆర్థిక సహాయం చేయాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలిసి విన్నవించారు. అందుకు స్పందించిన సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వారికి ఎల్.ఓ.సీ కింద 2లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే చేతులమీదుగా గురువారం బాధితుడి తల్లి సంధ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
వర్కాల సూర్యనారాయణకు ఉగాది పురస్కార అవార్డు