తెలంగాణ

దేశ రక్షణకు ఎంతకైనా పోరాడుతాం.. మావోయిస్టులకు మద్దతిస్తున్న వారు జాగ్రత్త : బండి సంజయ్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- కేంద్ర మంత్రి బండి సంజయ్ కొంతమంది రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులకు మద్దతిస్తున్నటువంటి రాష్ట్ర రాజకీయ నేతలను వదిలే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తూ ఎవరైతే నక్సలైట్లకు మద్దతిస్తున్నారో వారు తక్షణమే మావోయిస్టులతో సంబంధాలను తెంచుకోవాలని సూచించారు. అలా చేయని పక్షంలో వారు ఎంత పెద్ద నాయకులైన సరే వారి తాటతీస్తామని తెలిపారు. కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టుల విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. దేశంలో అవినీతి, ఘోరమైన నేరాలకు రక్షణ కల్పిస్తున్న వారిని ఎట్టి పరిస్థితులలో వదిలి పెట్టేది లేదని… మావోయిస్టులను అలాగే వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులను కూడా కేంద్ర ఏజెన్సీలు ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం ఎంతకైనా వెనుకాడబోమని… వీటి వెనుక ఎంత పెద్దవారు ఉన్నా కూడా జాలి చూపికుండా ఈ కేంద్ర ఏజెన్సీలు ఏరిపారేస్తాయని సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. బండి సంజయ్ చేసినటువంటి ఈ వార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా చర్చించే విధంగా ఉన్నాయి. ఇప్పటికే మావోయిస్టులు కొంతమంది పోలీసులకు వద్దకు వచ్చి లొంగిపోగా… మరి కొంతమందికి రాజకీయ నాయకులు సహాయం చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి తరుణంలో బండి సంజయ్ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడంతో… రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టులపై నిఘా పెట్టి ఉంచాయని… దొరికితే వదిలే ప్రసక్తే లేదని తెలిపారు.

Read also : బిగ్ బాస్ అంతా ఫేక్ ఏనా… మనం వేసే ఓట్లు నిజం కాదా?

Read also : అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button