
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా హామీలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన మరియు టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఒక ముఖ్యమంత్రిగా నేను ముగ్గురం కలిసే సంక్షేమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మాటిచ్చారు. తాజాగా నేడు మంత్రులు, హెచ్వోడీలు మరియు సెక్రెటరీలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Read also : పాకిస్తాన్ అమ్మాయిల గుండెల్లో అభిషేక్ శర్మ.. గూగుల్లో తెగ వెతికేస్తున్నారంట?
ఈ సమావేశంలో భాగంగా గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని మరోసారి స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా మోదీ, రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా నేను ముగ్గురం కూడా కలిసే ఎవరి బాధ్యతలను వారు పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి అని తెలిపారు. ఆర్థిక శాఖ నిధులు లేవని చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట కోసం హార్డ్ వర్క్ చేసి ఎన్నో పరిష్కారాలు కనుగొంటున్నామని.. ఇకపై కూడా ఇదే విధంగా రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గపు ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కు ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించాలి అని.. అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లి వివరించాలి అని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు అందరు కూడా వారి వారి బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని హెచ్చరించారు.
Read also : అఖండ-2 ఎఫెక్ట్.. పలు సినిమాలకు భారీ ఎదురుదెబ్బ!





