Tuesday, February 24, 2026
Homeఅంతర్జాతీయంఖమేనీని చంపాలనుకున్నాం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన!

ఖమేనీని చంపాలనుకున్నాం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన!

Khamenei Elimination: తాజా యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని చంపాలని భావించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇందుకోసం అతడు దాక్కున్న బంకర్ కోసం గాలించినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖట్జ్ తెలిపారు. తమకు సరైన సమాచారం లభించకపోవడం వల్లే ఖమేనీ ప్రాణాలతో బయటపడినట్లు ప్రకటించారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం వల్లే, ఆయనను చంపాలనే ఆలోచనను వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఆయన బయట ఉంటే కచ్చితంగా చంపేసే వాళ్లం అన్నారు.

ఇరాన్ టాప్ నాయకుల టార్గెట్

ఇరాన్ కు చెందిన కీలక నాయకులను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లు ఆ దేశం అధికారికంగా వెల్లడించింది. ఐడీఎఫ్‌, ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఇరాన్‌ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగాయి. అయితే, తొలిసారి ఆదేశ సుప్రీం లీడర్ ను చంపేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించంతో అందరూ షాక్ అవుతున్నారు. హెజ్ బొల్లా అధినేత నస్రుల్లా.. ఖమేనీని బంకర్ లోనే ఉండాలని సూచించినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అమెరికా, ఇజ్రాయెల్ పై ఖమేనీ తీవ్ర ఆగ్రహం

ఇజ్రాయెల్ తో యుద్ధం కారణంగా బంకర్ లోకి వెళ్లిన ఖమేనీ, తొలిసారి ఆదేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఖతార్ లోని అమెరికా బేస్ మీద దాడి చేసి అగ్ర రాజ్యం చెంప చెల్లుమనిపించినట్లు వెల్లడించారు. 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ వీడియో ఆయన అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ తమపై దాడి చేస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రసంగ సమయంలో ఖమేనీ తీవ్ర అలసటగా కనిపించారు. ప్రస్తుతం ఖమేనీ వయసు 86 ఏళ్లు.

Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం.. భారత్ తటస్థ వైఖరికి కారణమేంటి?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments