
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్ మరియు విరాట్ కోహ్లీలపై భారత మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2027 వరల్డ్ కప్పులో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనేదానిపై క్లారిటీ ఇచ్చారు. వరల్డ్ కప్ లో ఆడాలంటే ఫిట్నెస్ అలాగే ఫామ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి వారు త్వరలోనే ఆస్ట్రేలియాతో జరగబోయేటువంటి వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించాలని… ఈ సిరీస్ అయిపోయే లోపు భారత జట్టులో కొనసాగాలా?.. లేదా?.. అనేది వారికే ఒక క్లారిటీ వస్తుంది అని అన్నారు. మరోవైపు ఇప్పటికే భారత యంగ్ క్రికెటర్స్ గిల్, జైశ్వాల్ అలాగే తిలక్ వర్మ లాంటి యువ క్రికెటర్స్ చాలా బాగా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి సందర్భంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్పులో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా ఫిట్నెస్ అలాగే ఫామ్ ఉంటేనే సాధ్యమవుతుంది అని అన్నారు. కాబట్టి వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకోవాలంటే రేపు జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ లు చాలా కీలకంగా మారనున్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికీ రోహిత్ శర్మ అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తూ ఆస్ట్రేలియా సిరీస్ కు నేను సిద్ధం అంటూ పేర్కొన్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ గురించి ఎటువంటి వార్తలు ఐతే సోషల్ మీడియాలో రావడం లేదు. 2027 వరల్డ్ కప్పులో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆడి తీరాలి అని ఫ్యాన్స్ అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదంతా వాళ్ళ ఫిట్నెస్ అలాగే ఫామ్ పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్స్ పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలోనే ఆస్ట్రేలియా సిరీస్లో వీరిద్దరూ అద్భుతంగా రాణించాలని ఒకవైపు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మరోవైపు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read also : మరికొద్ది సేపట్లో తెలంగాణలో భారీ వర్షాలు..!
Read also : ఖమ్మం మంత్రులపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే