
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు రెండవ శనివారం సందర్భంగా పాఠశాలలు యధావిధిగా నడపాలి అని కొంతమంది డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. కానీ ఇటీవల మొంథా అనే తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలో నాలుగు నుంచి ఐదు రోజులపాటు సెలవులు ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సెలవులకు బదులుగా రెండవ శనివారాల్లో పాఠశాలలో నడపాలి అని.. కాబట్టి ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు రేపు స్కూళ్లకు యధావిధిగా హాజరు కావాలి అని సూచించారు. విశాఖపట్నం, ఏలూరు మరియు బాపట్ల జిల్లాలలో స్కూలు యధావిధిగా తెరుచుకోనున్నాయి. అలాగే డిసెంబర్ 13వ తేదీ మరియు 14వ తేదీ కూడా యధావిధిగా పాఠశాలలు పనిచేస్తాయి అని తెలిపారు. అయితే అన్ని జిల్లాలలో రేపు స్కూల్లు ఉంటాయా అనేది అయితే ఇంకా సమాచారం రావాల్సింది. మరి రేపు మీ పాఠశాలకు సెలవు ఉందో లేక యదావిధిగా పాఠశాలలు నడుస్తాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : కాటేదాన్ దక్కన్ శబరి పీఠం నుంచి శబరిమలకు సువర్ణ భూమి మహా పాదయత్ర
Read also : కారణాలు చెప్పకుండా అరెస్టు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : సుప్రీంకోర్టు





