
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ఎన్నో సినిమాలను ఓటిటిలో విడుదలైన మొదటి రోజునే పైరసీ చేసినటువంటి ఐ బొమ్మ గురించి ఎంతోమంది డైరెక్టర్లు మరియు నటులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దాదాపు చాలా రోజుల తర్వాత ఐ బొమ్మ రవిని అరెస్టు చేశారు. అతని దగ్గర మూడు కోట్ల రూపాయల వరకు పోలీసులు ఫ్రీజ్ చేశారు. అయితే తాజాగా ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకుగాను పలువురు సెలబ్రిటీలు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా చిరంజీవి, రాజమౌళి, నాగార్జున మరియు దిల్ రాజు వంటి కొంతమంది సినీ ప్రముఖులు హైదరాబాద్ సిపి సజ్జనార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగానే చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పైరసీ భూతంతో సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరం పోరాడుతున్నాం. దీనివల్ల లక్షల మంది సినీ కార్మికులు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు అంటూ.. ఎంతోమంది కష్టాన్ని అలాగే సంపాదనను అక్రమంగా దోచుకోవడం కరెక్ట్ కాదు అని సినీ ప్రముఖులు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పట్టుబడి మేము బరిలోకి దిగితే నేరగాళ్లు ఎక్కడున్నా కూడా పట్టుకునే సత్తా మాకు ఉందంటూ పోలీసులు నిరూపించారు అని మరోవైపు దిల్ రాజ్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనా కూడా ఎన్నో రోజుల తర్వాత ఐ బొమ్మ అనే పైరసీ ఫ్లాట్ ఫామ్ ను క్లోజ్ చేయించారు. ఐగుమను నిర్వహిస్తున్న రవిని అలాగే అతనితోపాటు కొంతమందిని పోలీసులు పట్టుకున్నారు. ఇక మరికొన్ని పైరసీ వెబ్సైట్లు మిగిలి ఉండగా వాటిని కూడా త్వరలోనే మూయిస్తాము అని పోలీస్ అధికారులు తెలిపారు.
Read also : Upendra Dwivedi: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్… ఆర్మీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!
Read also : Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరో ఉగ్రవాది అరెస్ట్, అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్!





