
మహేశ్వరం ప్రతినిది (క్రైమ్ మిర్రర్):- కాంగ్రెస్ పార్టీ విధేయుడు, సీనియర్ నాయకులు ఎర్రబాపు ఇజ్రాయిల్ ను కోల్పోవటం వ్యక్తిగతంగా, పార్టీకీ తీరని లోటని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.తుమ్మలూరు నివాసంలో ఇజ్రాయిల్ పార్థీవదేహానికి పూల మాలలు వేసి.. కాంగ్రెస్ జెండా ఉంచి కేఎల్ఆర్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా కిచ్చెన్న మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇజ్రాయిల్ అన్నారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని లక్ష్మారెడ్డి ప్రార్థించారు.క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరుగుతున్న అంతిమయాత్రలో కేఎల్ఆర్ పాల్గొన్నారు. ఇజ్రాయిల్ కు నివాళులు అర్పించిన వారిలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు, మహిళా నేతలు ఉన్నారు.