
కొయ్యలగూడెం,క్రైమ్ మిర్రర్:- చౌటుప్పల్ మండలం,కొయ్యలగూడెం గ్రామంలో ఈనెల 17న మూడో విడత పోలింగ్ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరిమికొండ స్వప్న అశోక్ ల కూతుర్లు మేము పేదవాళ్ళము అని ఉంగరం గుర్తుకు ఓటు వేసి మా అమ్మను గెలిపించాలని లహరి, భువన ఓటర్ మహాశయులను వేడుకుంటున్నారు. గతంలో మా నాన్న కర్మికొండ అశోక్ కు గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి పనిచేసిన అనుభవం కలిగి ఉన్నాడు అని మరియు మన కొయ్యలగూడెం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తనకు తెలుసు అని నిత్యం గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మన్ననలు పొందాడు అని మా కుటుంబానికి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని వేడుకున్నారు.
Read also : బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి.. గ్రామాలను అభివృద్ధి చేసుకోండి
Read also : Sleep: రాత్రి పూట నిద్రపోయేటప్పుడు బెడ్‌రూమ్‌లో లైట్లు ఆపేయాలా? ఆన్‌లో ఉంచాలా?





