
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ప్రకృతిని ప్రజలు ఎంతలా నాశనం చేస్తున్నారు అంటే దానికి ప్రత్యేకంగా సాక్షాలు కూడా చూపించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ ప్రజలు తమ అతి తెలివితేటలను ఉపయోగించి మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. మనం పీల్చేటువంటి గాలి నుంచి తాగేటువంటి నీరు వరకు కూడా ప్రతి ఒక్కదాంట్లో కూడా కలుషితం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా అంతర్జాతీయ అధ్యాయనం ప్రకారం 2050 నాటికి కొన్ని కోట్ల మందికి త్రాగడానికి నీరు దొరకని పరిస్థితులు ఏర్పడతాయి అని హెచ్చరిస్తున్నారు. వియాన్నా కు చెందిన కాంప్లెక్స్ సిటీ సైన్స్ హబ్ మరియు ప్రపంచ బ్యాంకు కలిసి ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా లోని 100కు పైగా నగరాలను పరిశీలించి అధ్యయనం చేశారు. పలు ముఖ్య నగరాలను ఇష్టానుసారంగా విస్తరించుకుపోతున్న సందర్భంలో ఏకంగా 220 మిలియన్ల ముందుకి స్వచ్ఛమైన నీరు దొరకదని ఆశ భావం వ్యక్తం చేశారు. 2050 నాటికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక ద్వారా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు అని ఈ అధ్యయన శాస్త్రవేత్తలు సూచించారు. కాబట్టి ఏదైనా సరే మనం ఉపయోగించేటువంటిది వృధా చేయకుండా ఉపయోగించాలి అని తెలిపారు.
Read aslo : దేవుడంటే భక్తి లేదు,ఆలయాలంటే లెక్కలేదు : సీఎం చంద్రబాబు
Read also : అజ్జిలాపురం సర్పంచ్ అభ్యర్థి నిర్వాహకం.. మధ్యం, కాసులతో ఓటర్లకు వల?





