
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేసవికాలం ఇంకా ప్రారంభం కాకముందే ఒకవైపు తెలంగాణలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటలు ఎండిపోతున్నాయి. గత సంవత్సరంలో కృష్ణ మరియు గోదావరిలో నీరు సమృద్ధిగా ఉండడం, అంతేకాకుండా ప్రాజెక్టులలో సైతం నీరు కళకళలాడుతుండడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరగడం కారణంగా అన్నదాతలందరూ కూడా పలు రకాల పంటలను గణనీయంగా పండించారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది పరిస్థితి అంతకుమించి దిగజారుతుంది.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొద్ది రోజుల నుంచి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లు ఖాళీ అయిపోతున్నాయి. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రాజెక్టులలోని నీరు అడుగంటి పోతుంది. భూగర్భ జలంలోని నీరు తగ్గిపోయి బోర్లకు కూడా నీరు రావడం తగ్గిపోయింది. దీంతో నీరు అందక తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు సవాలుగా మారిపోయింది. పండించిన పైరు ఎక్కడ ఎండిపోతుందో అని గుండెల్లో కునుకు లేకుండా బతుకుతున్నారు. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయని అన్నదాతలు చెబుతున్నారు. ఏది ఏమైనా సరే ఈసారి మాత్రం ఖచ్చితంగా పైరులు ఎండిపోయి నష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు వెంటనే రైతుల వ్యవసాయంపై పలు అవగాహన కల్పిస్తూ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయదారులు కోరుతున్నారు.
ఎమ్మెల్సీ ఎఫెక్ట్ – కేబినెట్ నుంచి ఏడుగురు మంత్రులు ఔట్..?