Homeఆంధ్ర ప్రదేశ్శ్రీశైలం డ్యామ్ లో అట్టడుగుకు చేరిన నీటి నిల్వలు

శ్రీశైలం డ్యామ్ లో అట్టడుగుకు చేరిన నీటి నిల్వలు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అట్టడుగు చేరాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ నీటిని ఉపయోగించుకుని జీవనం కొనసాగిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతేకాకుండా ఇరు రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ శ్రీశైలం జలాశయం నుంచి ఉత్పత్తి అవుతుంది. అయితే ఈరోజు శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు మరింత అడుగంటడంతో.. ఇరు రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. గడిచిన 10 నెలల్లో కుడిగట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2060 మిలియన్ యూనిట్లు, అలాగే ఎడమ గట్టులో తెలంగాణ రాష్ట్రానికి 2275 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు ఇంతటి స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు 2007-08 సంవత్సరంలో 2054 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది. కానీ ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటడంతో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సరఫరా లో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మే నెల నుంచి తెలుగు రాష్ట్రాలలో జనగణన!

అలర్ట్..!ఓవైపు పిడుగులు, మరోవైపు వడగాలులు?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments