Monday, February 23, 2026
Homeతెలంగాణశ్రీశైలం ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద, త్వరలో గేట్లు ఓపెన్!

శ్రీశైలం ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద, త్వరలో గేట్లు ఓపెన్!

Srisailam Project: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవక పోయినా, ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు బాగానే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులోకో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేని వానల కారణంగా జలాశయంలోకి భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. ఇవాళ ఉదయం జూరాల ప్రాజెక్టు నుంచి 1.56 లక్షల క్యూసెక్కులు నీరు శ్రీశైలం లోకి ప్రవహిస్తోంది. ఇదే ఫ్లో కొనసాగితే త్వరలోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. అంతేకాదు, శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయనున్నారు.

శరవేగంగా పెరుగుతున్న నీటిమట్టం

శ్రీశైలం ప్రాజెక్టులోకి అంతకంతకూ వరద నీరు పెరగడంతో ప్రాజెక్టు నీటమట్టం గంట గంటకు పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 872.50 అడుగులుగా ఉంది. మరో 12 అడగులు చేరితే ప్రాజెక్టు నిండుకుండగా మారనుంది. అటు శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో152 టీఎంసీలకు చేరుకుంది. నీటి మట్టం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పర్యవేక్షణను ముమ్మరం చేశారు.

పర్యాటకులను అప్రమత్తం చేసిన అధికారులు

అటు వరుద ప్రవాహం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ ప్రజలతో పాటు పర్యాటకులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పరిస్థితిని బట్టి ఎప్పుడైనా ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు. నీటి ప్రవాహం పెరిగితే డౌన్ స్ట్రీమ్ ప్రామతాల్లోని ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎందుకైనా మంచిది ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు.

Read Also: తెలంగాణలో 3 రోజులు వర్షాలు.. ఏపీలో ఎక్కడ కురుస్తాయంటే?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments