
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందని ఎగిరి ఎగిరి పడితే తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలలో మా పార్టీ అధికారంలోకి వస్తే మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి తో వచ్చేటువంటి భక్తి కంటే భయంతో వచ్చే భక్తి ఎక్కువ కాలం ఉంటుందని… వార్నింగ్ ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం.. ప్రతి ఉదయం కూడా ప్రజల దగ్గరికి వెళ్లి గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అని ప్రజల నుండి మంచి పేరు తెచ్చుకుంటే… మీరు గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి భూ కబ్జాలు చేశారని మాట్లాడుతున్నారు. ఏది అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల అవుతున్న ఒకటైన బయట పెట్టారా?.. అంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇదేవిధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూటమి నేతల పని అయిపోయినట్లే అని బెదిరిస్తున్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్లూ డిజిటల్ యాప్ అని చెప్పి ఒక యాప్ తీసుకువచ్చారు. ఈ యాప్ లో ఎవరైనా కూటమినేతలు వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే వారి పేరు, వారు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అనేది కంప్లైంట్ చేయండి అంటూ.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తాట తీద్దామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. నేరుగా పార్టీ అధినేత హెచ్చరించిన తర్వాత.. ప్రతి ఒక్కరులోనూ భయం నెలకొంది. పొరపాటున వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే ఎవరైతే వారిని ఇబ్బంది పెట్టారో దానికి మూడు రేట్లు ఎక్కువగా పగ తీర్చుకుంటామని చెప్పుకొస్తున్నారు. ఇదే తరుణంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో దీనికి ఇంకా ప్రాచుర్యం అందుకుంది.
Read also : అప్పుడు విరాట్.. ఇప్పుడు రోహిత్.. తెలుగోడికి ఇంతకంటే అదృష్టమా?
Read also : ఏపీలో అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షాలు..!