ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

ఈ జిల్లాలకు హెచ్చరిక!.. రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక , క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని పలు జిల్లాలలో రానున్న 2-3 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. కాబట్టి వర్షాలు పడే జిల్లాల ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

తెలంగాణలో వర్షాలు పడే జిల్లాలు
1. హనుమకొండ
2. జగిత్యాల
3. హైదరాబాద్
4. ఖమ్మం
5. అసిఫాబాద్
6. నిజామాబాద్
7. వరంగల్
8. మహబూబాబాద్
9. మేడ్చల్
10. నిర్మల్
11. మంచిర్యాల్
12. నల్గొండ
13. సంగారెడ్డి
14. రంగారెడ్డి
15. భద్రాద్రి
16. పెద్దపల్లి

ఏపీలో వర్షాలు పడే జిల్లాలు
1. తిరుపతి
2. పశ్చిమగోదావరి
3. ప్రకాశం
4. చిత్తూరు
5. విశాఖపట్నం

పైనున్న జిల్లాల ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వర్షాలు పడుతున్న సమయంలో ఎవరూ కూడా బయట ప్రాంతాల్లో తిరగకూడదని.. కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. కాబట్టి ఇటువంటి తరుణంలో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క చిన్న పిల్లల పై ఒక కన్ను వేసి ఉంచాలని అధికారులు హెచ్చరించారు.

Read also: కుర్రకారు మతి పోగొడుతున్న మిరాయ్ హీరోయిన్ రితిక!

Read also : తురకపాలెం లో మరణాలకు యురేనియమే కారణమా?.. అసలు ఏం జరుగుతోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button