
– వరదల్లో వరంగల్
– ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు
– నదులను తలపిస్తున్న రోడ్లు
– అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న అధికారులు
క్రైమ్ మిర్రర్, వరంగల్ న్యూస్:- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక బయట పని చేసే కూలీలు, కంపెనీలలో జాబ్ చేసే యువకులు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో వీధులన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. నిన్న కురిసినటువంటి కుండపోత వర్షానికి వరదల్లో వరంగల్ ఉన్నట్లు అనిపిస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వీధులన్నీ వరదల్లో ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాలు దెబ్బకి కాలనీలోని జనాలు కూడా బయటకు రాలేని పరిస్థితిలో ఏర్పడ్డాయి.
Read also: అందరి చూపు పులివెందుల.. ఎందుకంత టెన్షన్!.. నాయకుల ఆరోపణలు ఇవే?
ఇక వరంగల్ – ఖమ్మం రోడ్ లోని అండర్ బ్రిడ్జి ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. గడిచిన 12 గంటల్లో ఉమ్మడి జిల్లాల్లో 92.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అన్ని మార్గాల్లోని చెరువులు మరియు వాగులు, ఉప్పొంగి ప్రవహించడం వల్ల రాకపోకులకు చాలానే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలానే మరో రెండు మూడు రోజులు పాటు భారీ వర్షాలు మాత్రం పడితే… నగరం ముంతా కూడా మరోసారి మునిగిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఈరోజు ఇవే హెడ్లైన్లో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కన్నా ఈ ఏడాది ముందుగానే భారీ వర్షాలు పడుతుండడంతో ప్రజలు కూడా చాలానే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులు ఇప్పటికే తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆయా సమస్యలకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్లు చేయాలని సూచిస్తున్నారు. వృద్ధులు ముఖ్యంగా పిల్లలు.. కరెంట్ స్తంభాల వద్ద లేదా ఆరు బయట వర్షాలు పడుతున్న సమయంలో ఉండకుండా తల్లిదండ్రుల బాధ్యత వహించాలని అధికారులు హెచ్చరించారు.
Read also : “మహావతార్ నరసింహ” సినిమా ముందు వెనుక పడ్డ బాలీవుడ్ బాడా హీరోల సినిమా వసూళ్లు