తెలంగాణ
Trending

రైతు రుణమాఫీ పై అసెంబ్లీలో మాటల యుద్ధం!…

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీలో రైతు రుణమాఫి విషయంలో ఇది పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అధికార, విపక్షాల మధ్య హోరా హోలీగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయితే దీనిపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలుపుతున్నారు. సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో రైతుల వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ జిల్లాల వారీగా ఎన్ని కోట్ల మాఫీ జరిగిందో బట్టి విక్రమార్క చదివి వినిపించారు.

తిరుమల మాఢ వీధుల్లో మద్యం తాగి హల్చల్

అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న దాని కంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఎక్కువ రుణమాఫీ చేశామని తెలిపారు. కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ లాంటి సొంత నియోజకవర్గం టిఆర్ఎస్ హయాంలో కంటే కాంగ్రెస్ పాలనలోని ఎక్కువ రుణమాఫీ జరిగిందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గజ్వేలులో అప్పట్లో 104 కోట్ల రుణమాఫీ జరిగితే ఇప్పుడు ఏకంగా 237 కోట్లు చేశామని అన్నారు. అలాగే సిద్దిపేటలో గతంలో 96 కోట్ల రుణమాఫీ అయితే.. కాంగ్రెస్ పాలనలో 177 కోట్లు రుణమాఫీ చేశామని అన్నారు. మరోవైపు సిరిసిల్లలో అప్పుడు 101 కోట్ల మాఫీ చేస్తే ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉండగా 175 కోట్ల రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. అయితే బిఆర్ఎస్ నాయకులు మీరు చెప్పిన లెక్కలన్నీ తప్పే అంటూ కౌంటర్లు ఇస్తుండడంతో అసెంబ్లీలో రుణమాఫీ ఫై మాటల యుద్ధం కొనసాగుతుంది.

ఘోర రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి?

రేవంత్ మరో మోసం..ఇందిరమ్మ ఇళ్లు ఇప్పట్లో లేనట్టేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button