- యుద్ధం ఖర్చు రోజుకు 7 వేల కోట్లు
న్యూయార్క్, క్రైమ్ మిర్రర్ :యుద్దం రోజు రోజుకు తీవ్రమవుతోంది. బాంబులు, మిస్సైల్లు, క్షిపణులతో పశ్చిమాసియా రక్తసిక్తంగా మారుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్‌తో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం మార్చి 3వ తేదీనాటికి తీవ్రరూపం దాల్చింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించినా ఇరాన్ పోరాటంలో వెనక్కు తగ్గడం లేదు. ప్రతీకార దాడులు ఉధృతం చేసింది. దీంతో ఈ యుద్ధం నాలుగు వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.ఫిబ్రవరి 28, 2026న అమెరికా పరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా ఇరాన్‌పై యుద్ధం ప్రకటించింది.
ఇక ఇజ్రాయెల్ ఆపరేషన్ లయన్ రోర్ పేరుతో ఇరాన్ లక్ష్యాలపై గగన, భూ, సముద్ర దాడులు చేసింది. ఇరాన్‌కు చెందిన 11 నౌకలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ అణు కార్యకలాపాలను ఆపమని ట్రంప్ హెచ్చరించగా, ఇరాన్ గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ స్థావరాలపై ప్రతీకార దాడులు చేసింది.అమెరికా 20కి పైగా ఆయుధ వ్యవస్థలు ఉపయోగిస్తోంది, యుఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి వాహక నౌకలు మోహరించింది.
ఇరాన్ హెజ్‌బొల్లా, ఇరాక్ మిలీషియాతో కలిసి డ్రోన్, క్షిపణి దాడులు చేస్తోంది. అమెరికా వైపు 6 మంది సైనికులు మరణించారు, మూడు విమానాలు కూలాయి.యుద్ధం ప్రారంభించి5న తొలి 24 గంటల్లో అమెరికా 779 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 వేల కోట్లు) ఖర్చు చేసింది. ముందస్తు యుద్ధ నౌకల మోహరింపునకు మరో 630 మిలియన్ డాలర్లు అంటే రోజుకు 6.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
ఇజ్రాయెల్ మద్దతుకు 21.7 బిలియన్, ఇతర ఆపరేషన్లకు 9–12 బిలియన్ డాలర్లు వెచ్చించింది. మొత్తం 31–33 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందిట్రంప్ నాలుగైదు వారాలు యుద్ధం కనొసాగుతుందని ప్రకటించారు. అవసరమైతే భూదాడులు చేస్తామని ప్రకటించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అమెరికాకు మద్దతు ప్రకటించాయి. అయితే అమెరికా వద్ద క్షిపణి రక్షణ వ్యవస్థలు పరిమితం, ఉక్రెయిన్, ఆసియాకు పంపించారు.
యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే నష్టాలు పెరిగి రక్షణ బడ్జెట్ 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరగవచ్చు.ఆయుధ నష్టాలు, సాంకేతిక లోపాలు ఆందోళనకరం. ఇరాన్ సైప్రస్, గల్ఫ్ లక్ష్యాలపై దాడులు పెంచుతోంది. జెనీవాలో పరోక్ష చర్చలు జరుగుతున్నా, యుద్ధం అనివార్యమని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.కాగా చైనా, రష్యా ఇరాన్‌కు మద్దతు పలికాయి. కాగా ఇవి గనుక ప్రత్యక్షంగా యుద్దంలోకి వస్తే ఇక మూడో ప్రపంచ యుద్దం తప్పదేమో అని పలువురు భావిస్తున్నారు.
