
గ్రామ పంచాయతీకి ఎంత నిధులు వస్తున్నాయి, ఆ నిధులను ఎలా వినియోగిస్తున్నారన్న వివరాలు చాలా మందికి తెలుసుకోవాలనిపిస్తుంది. అయితే ఇలాంటి సమాచారాన్ని ఎక్కడ చూసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే సందేహం సాధారణమే. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా పారదర్శకంగా చూడడానికి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అత్యంత ఉపయోగకరమైన వేదికే e-Gram Swaraj పోర్టల్. ఈ పోర్టల్‌లో దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల విడుదల, ఖర్చులు, పథకాల ప్రయోజనాలు, అభివృద్ధి పనులు, వార్షిక ప్రణాళికలు వంటి వివరాలు స్పష్టంగా చూడొచ్చు.
ప్రతి ఏడాది ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధులు, కేంద్ర పథకాల కింద వచ్చే అభివృద్ధి నిధులు, వాటిని ఏ పనులకు వినియోగించారు, ఏ పని కోసం ఎంత మొత్తాన్ని ఖర్చు చేశారు వంటి కీలక సమాచారాన్ని ఈ పోర్టల్‌లో ట్రాక్ చేయవచ్చు. గ్రామానికి సంబంధించిన అన్ని పనులు, వాటి స్థితి, ఖర్చు వివరాలు, గ్రాంట్ల వినియోగం అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటం వల్ల గ్రామ స్థాయి పారదర్శకత మరింత పెరుగుతుంది. గ్రామ అభివృద్ధిపై ప్రజలు కూడా నేరుగా పర్యవేక్షణ చేయగల అవకాశం లభిస్తుంది.
అయితే కేంద్ర పథకాల వివరాలు e-Gram Swaraj పోర్టల్‌లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్రామాలకు వచ్చే నిధుల వివరాలు తెలుసుకోవాలంటే PR పోర్టల్ చెక్ చేయాలి. ఈ రెండు పోర్టళ్లను ఉపయోగించడం ద్వారా గ్రామాభివృద్ధికి సంబంధించిన పూర్తి ఆర్థిక సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
ALSO READ: KTR: పత్తి రైతులు కష్టాల్లో ఉన్నా.. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాలు





