క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- జనవరి 2026 సంక్రాంతి పండుగకు ఇప్పటినుంచి కరెక్టుగా రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎవరైతే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇంటికి వెళ్లాలి అని అనుకుంటున్నారో వారు ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే సంక్రాంతి పండుగకు ఇతర పట్టణాల నుంచి వారి స్వగ్రామానికి వెళ్లాలనుకునే వారు ఎవరైతే ఉంటారో వారు ఇప్పటినుంచే IRCTC అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు అని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వే టికెట్ బుకింగ్స్ ఈసారి 60 రోజులు ముందుగానే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ఇవాళ జనవరి 9వ తేదీవి, రేపు 10వ తేదీవి, ఇక ఎల్లుండి 11వ తేదీవి, ఇక వచ్చే గురువారం రోజున 12వ తేదీకి సంబంధించిన టికెట్లు రిలీజ్ కానున్నాయి. కాబట్టి దూరపు ప్రయాణాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ ట్రైన్ టికెట్స్ ను ముందుగానే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. మరీ ముఖ్యంగా దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పలు ముఖ్య నగరాలలో ఇతర రాష్ట్రాల నుంచి చదువు రీత్యా లేదా ఉద్యోగం రీత్యా ఉంటున్న వారు ఎక్కువగా ఈ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి త్వరగా వీరందరూ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలని లేదంటే పండుగ సమయంలో భారీ రద్దీ వల్ల ఒకవైపు ట్రైన్ టికెట్లు మరోవైపు బస్సులు దొరకక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిపారు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ట్రైన్ టికెట్స్ ను ఈసారి 60 రోజులు ముందుగానే రైల్వే శాఖ అధికారులు విడుదల చేశారు. కావున ఇప్పటినుంచే బుకింగ్స్ చేసుకోవాలి అని ప్రకటించారు.
Read also : టీనేజర్లకు సోషల్ మీడియా బంద్.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం?
Read also : ఒక్కసారిగా మారిన వాతావరణం.. ప్రతి ఇంటిలోనూ జలుబు, తుమ్ముల శబ్దాలే?






