
Wang Yi Indian Visit: మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇవాళ భారత్ కు చేరుకోనున్నాఇరు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీడి కలవనున్నారు. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ఆయన నివాసంలో సమావేశం అవుతారు. భారత్- చైనా సరిహద్దు సమస్యలు, వాణిజ్య విస్తరణపై చర్చించనున్నారు.
ఇవాళ మధ్యాహ్నం 4.15 గంటలకు ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వాంగ్ యి చేరుకుంటారు. ఆ తర్వాత కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను హైదరాబాద్ హౌస్ లో కలుసుకుని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్న వాంగ్.. తన పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలుసుకుంటారు. చైనా-భారత్ సరిహద్దు సమస్యలపై ఈ భేటీలో చర్చలు జరుపుతారు.
భారత్ ఆహ్వానం మేరకు వాంగ్ యి ఈ పర్యటనకు వస్తున్నారు. సరిహద్దుల అంశంపై చైనా-ఇండియా ప్రత్యేక ప్రతినిధుల మధ్య జరుగుతున్న 24వ రౌండ్ చర్చల్లో ఆయన పాల్గొంటారు. 2020లో గల్వాన్ సంఘర్షణలు, కోవిడ్-19 నేపథ్యంలో భారత్-చైనాల మధ్య విబేధాలు కొనసాగాయి. ఆ తర్వాత లద్దాఖ్ సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, కైలాస్ మానససరోవర్ యాత్ర పున: ప్రారంభం కావడం వంటి విషయాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ట్రంప్ టారిఫ్ ల నేపథ్యంలో చైనా విదేశాంగమంత్రి భారత పర్యటన మరింత ఆసక్తి నెలకొంది.