
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత జట్టుకు ఒకప్పుడు కీలకమైన బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకరు. భారత జట్టులో ఒక బౌలర్గా తన బౌలింగ్ తో మెరిపించడంతోపాటుగా, రెండు వైపులా స్వింగ్ చేయగలిగే ఒకే ఒక బౌలర్ భువనేశ్వర్ కుమార్. అలాంటి భువనేశ్వర్ కు ప్రస్తుతం దురదృష్టపు ఘడియలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా జట్టులో భువనేశ్వర్ కుమార్ ను టాప్ 11 లో కాదు కదా.. కనీసం బెంచ్ ప్లేయర్ గాను తీసుకోవడం లేదు. ఈ విషయాలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో భువనేశ్వర్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే ఒక అవకాశం వస్తే స్టేట్ అలాగే జాతీయ జట్లకు నా సర్వశక్తుల ప్రయత్నించి నా బెస్ట్ ఇస్తా.. అని చెప్పుకొచ్చారు.
Read also : కాళేశ్వరం ఇష్యూను సీబీఐకే ఎందుకిచ్చారు – దీని వెనకున్న పొలిటికల్ గేమ్ ఏంటి..?
అలాగే జాతీయ జట్టుకు నన్ను ఎంపిక చేయకపోవడం అనేది నా చేతుల్లో లేదు అని… ఒకరిని ఎంపిక చేయాలంటే అది సెలెక్టర్లు నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని భారత గ్రేట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చారు. స్టేడియంలో ప్రతి ఒక్కరు బాగా ఆడుతాం.. చాలామంది ఫిట్ గా ఉంటారు.. కానీ అవకాశాలు మాత్రం కొందరికే వస్తాయి. నేను మాత్రం మైదానంలో బాగా ఆడడంతో పాటుగా ఫిట్నెస్ పై కూడా ఫోకస్ చేస్తూ… ఇక బౌలింగ్ సమయంలో లైన్ అండ్ లెంగ్త్ పై ఎప్పుడు కూడా ఫోకస్ పెడుతూ ఉంటానని భువనేశ్వర్ అన్నారు. కాగా భువనేశ్వర్ కుమార్ ఇండియా తరఫున చివరిగా 2022 నవంబర్లో న్యూజిలాండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో ఆడడం జరిగింది. ఇక ఆ తరువాత ఇండియా జుట్టు తరఫున ఏ ఫార్మేట్ లోను ఆడలేదు. ఇక ఐపీఎల్ అలాగే స్టేట్ లెవెల్ లో ఏదో ఒక జట్టు తరుపున భువనేశ్వర్ తన బౌలింగ్ మ్యాజిక్ ను చూపిస్తున్న కూడా జాతీయ జట్టుకు సెలెక్ట్ చేయడం లేదు. దీనిపై భువనేశ్వర్ కుమార్ అభిమానులు సెలక్టర్లపై మండిపడుతున్నారు.
Read also : హైదరాబాద్‌లో బీచ్ – 35 ఎకరాల్లో ఏర్పాటు..!