Homeతెలంగాణమొండి బకాయిలను వసూలు చెయ్యడమే నేను చేసిన తప్పు..!

మొండి బకాయిలను వసూలు చెయ్యడమే నేను చేసిన తప్పు..!

*మొండి బకాయిలను వసూలు చెయ్యడమే నేను చేసిన తప్పు..!*

*కక్షసాధింపుతో పచ్చి అబద్దపు ఆరోపణలు చేస్తున్నారు*

*శ్రీనిధి రికవరీ శాతం 18 నుంచి 85 శాతానికి పెంచింది*

*రికవరీలు పారదర్శకంగా అమలు చేస్తున్నందుకు దుష్ప్రచారాలు చేస్తున్నారు*

*విలేకరుల సమావేశంలో వివోఏ ముత్యాల సరిత, వివిధ సంఘాల సభ్యులు వెల్లడి*

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: మహిళా స్వయం సహాయక సంఘాల రికవరీలను మెరుగుపరిచే క్రమంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో కొంతమంది అసంతృప్తి వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన వివోఏ ముత్యాల సరిత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నల్గొండ జిల్లా, వేములపల్లి మండలము లక్ష్మీదేవిగూడెం గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన ఆవేదనను వెళ్లబుచ్చుకున్నారు. సందర్బంగా సరితా మాట్లాడారు…గ్రామంలోని మహిళల స్వయం సహాయక సంఘాల రికవరీలను మెరుగుపరిచే క్రమంలో తాను కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడంతో కొంతమంది అసంతృప్తి వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని పేర్కొన్నారు. మొండి బకాయిలను వసూలు చేయడం తప్ప తనవద్ద ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు.

విలేకరుల సమావేశంలో వివోఏ ముత్యాల సరిత, వివిధ సంఘాల సభ్యులు వెల్లడి
విలేకరుల సమావేశంలో వివోఏ ముత్యాల సరిత, వివిధ సంఘాల సభ్యులు వెల్లడి

నా పై, అధికారుల పై పచ్చి అబద్దపు ఆరోపణలు చేస్తున్నారు..

నేను సిసి పి గోపి సార్‌కు లంచం ఇచ్చినట్లు, ఆమనగల్లు, లక్ష్మీదేవిగూడెం సర్పంచులు నాకు సపోర్ట్ చేస్తున్నట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఖండించారు. అలాగే గతంలో పనిచేసిన పిచ్చమ్మ మేడం, రమణయ్య సార్‌ల ట్రాన్స్‌ఫర్‌ను తానే చేయించిందని ప్రచారం చేయడం అవాస్తవమని తెలిపారు. ఒక సాధారణ వివోఏగా అలాంటి అధికారాలు తనకు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇకపోతే లీడర్లకు ఓటు వేయమని ఒక్కొక్కరికి రూ.10,000 ఇచ్చినట్లు చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా అబద్ధమని పేర్కొన్నారు. అదేవిధంగా కోడి పిల్లలు అమ్ముకున్నట్లు ప్రచారం చేయడం కూడా అసత్యమని ఆమె మండిపడ్డారు.

విలేకరుల సమావేశంలో వివోఏ ముత్యాల సరిత, వివిధ సంఘాల సభ్యులు వెల్లడి
విలేకరుల సమావేశంలో వివోఏ ముత్యాల సరిత, వివిధ సంఘాల సభ్యులు వెల్లడి

శ్రీనిధి రికవరీ శాతం 18 నుంచి 85 శాతానికి పెంచింది

సందర్బంగా వివిదా సంఘం సభ్యులు,అధ్యక్షులు ఇటీవల జరిగిన పరిణామాలను వివరించిన మాట్లాడారు… గత రెండు రోజుల క్రితం అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించి, సంఘాల అధ్యక్షుల ద్వారా ఓటింగ్ చేపట్టారని చెప్పారు. ఆ ప్రక్రియలో వివోఏ ఎలాంటి తప్పు చేయలేదని అధికారులు నిర్ణయించి, మళ్లీ వివోఏ గా సరితాను నియమించి వెళ్లినట్లు పేర్కొన్నారు. సమావేశంలో మొత్తం 35 సంఘాలు ఉండగా అందులో సంపూర్నంగా 22 సంఘాలు పని చేస్తున్నాయి.

విలేకరుల సమావేశంలో వివోఏ ముత్యాల సరిత, వివిధ సంఘాల సభ్యులు వెల్లడి
విలేకరుల సమావేశంలో వివోఏ ముత్యాల సరిత, వివిధ సంఘాల సభ్యులు వెల్లడి

అయితే సమావేశంలో 17 సంఘాలు తనకు మెజార్టీ మద్దతు తెలిపాయని, అదే రోజు అధికారుల సమక్షంలోనే తాను మళ్లీ ఏకగ్రీవంగా కొనసాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. తనపై కక్షసాధింపుగా కొంతమంది కావాలని మీడియా, పత్రికా విలేకరుల ముందు తప్పుగా మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. రికవరీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం బాధాకరమని సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముత్యాల వెంకటమ్మ, లింగమ్మ, నవ్య, మౌనిక, సుజాత, రత్నబాయి తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments