
క్రైమ్ మిర్రర్, కడప:- వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ముఖ్యమైన అనుమానాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కేసులో కొత్త ఆరోపణలు, ఖైదీల బెదిరింపుల అంశాలపై విచారణ జరిపేందుకు ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఇటీవల హోంశాఖకు పంపిన ఫిర్యాదులో, కడప జైలులో విచారణ ఖైదీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మెడికల్ క్యాంప్ పేరుతో అధికారుల చేతుల్లో అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటుకు ముందుకొచ్చింది.
Read also : నడిరోడ్డుపై.. రెండు గ్రూపులుగా విడిపోయి గోరంగా కొట్టుకున్న విద్యార్థులు!
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీకి పోలీసు, రెవెన్యూ, మెడికల్ శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఖైదీలపై బెదిరింపుల ఆరోపణలను, మెడికల్ క్యాంప్ నిర్వహణను సమగ్రంగా పరిశీలించి, వాస్తవాలను నివేదిక రూపంలో ప్రభుత్వం ముందుంచాల్సి ఉంటుంది. ఈ కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఖైదీలకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టు నిరూపితమైతే, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.
Read also :- బంగాళాఖాతంలో అల్పపీడనం.. దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు
ఇప్పటికే సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తాజా ఆరోపణలు కేసును మరింత సున్నితంగా మారుస్తున్నాయి. కేసులో నిందితుల ప్రవర్తన, విచారణ సమయంలో ఖైదీలకు ఎదురవుతున్న ఒత్తిళ్లు ఇప్పుడు దృష్టి కేంద్రంగా మారాయి. సునీత పునరుద్ఘాటించిన అంశాలపై విచారణ జరగడంతో, వివేకా హత్య కేసు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.