హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: నటులు విజయ్ దేవరకొండ, రష్మిక వివాహబంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్ మూడుముళ్లు వేశారు. కొత్త పెళ్లి జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ పెళ్లి వేడుక రెండు సంస్కృతుల, సంప్రదాయాల కలయికగా జరుగుతోంది.
ఉదయం విజయ్ వైపు నుంచి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా జరుగుతోన్న ఈ వివాహానికి ఇండస్టీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ సంబరాల్లో భాగంగా విజయ్ ` రష్మిక ’విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో సరదాగా ఓ చిన్న క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించినట్లు ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అలాగే బుధవారం హల్దీ వేడుకను నిర్వహించినట్లు విరోష్ జోడీ తెలియజేసింది. ఇక వీరి వివాహ విందును మార్చి 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

