క్రీడలుసినిమా

టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసిన విరాట్ కోహ్లీ!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేశారు. కొంచెం ఖాళీ సమయం దొరికినా.. లేదా బోర్ కొట్టిన తెలుగు సినిమాలు చూస్తే అది ఎన్టీఆర్ సినిమాని చూస్తానని.. అందుకే నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని విరాట్ కోహ్లీ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నటనన్న, వ్యక్తిత్వం అన్న నాకు ఎంతో ఇష్టమని.. ఎప్పుడైనా కలిసిన చాలా ఆప్యాయంగా మాట్లాడుతారు అని ఎన్టీఆర్ ని ప్రశంసించారు. గతంలో ఒకే ఒకసారి రోడ్ సేఫ్టీ అవగాహన అనే కార్యక్రమంలో ఎన్టీఆర్ ని మొట్టమొదటిసారిగా కలిశానని, అప్పటినుంచి మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడిందని విరాట్ కోహ్లీ అన్నారు. అంతేకాకుండా RRR సినిమాలోని “నాటు నాటు” అనే పాటకు ఆస్కార్ రావడం అనేది చాలా గొప్ప విషయం అని అందుకు ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలిపారని అన్నారు.

Read also : టాలీవుడ్ లో విషాదం.. అల్లు రామలింగయ్య భార్య మృతి!

ప్రస్తుతం టీ20 మరియు టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నారు. వచ్చే నెల అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే మూడు వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తారని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం లండన్ లోనే నివాసం ఉంటున్న కోహ్లీ.. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చివరిసారిగా ఐపిఎల్ 2025 సీజన్ లో ఆడిన విరాట్ కోహ్లీ.. బెంగళూరు ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత పూర్తిగా కుటుంబానికి పరిమితమవుతూ లండన్ లోనే ఉండిపోయారు. ఎట్టకేలకు విరాట్ కోహ్లీ తన 18 ఏళ్ల కలను సాకారం చేసుకోవడంతో విరాట్ కోహ్లీతో పాటుగా తన సతీమణి అనుష్క శర్మ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని చెప్పడం ఎన్టీఆర్ అభిమానులలో చాలా జోష్ నింపుతుంది.

Read also : పాలేరు వాగులో గల్లంతైన గొండ్రియాల యువకుడి మృతదేహం లభ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button