టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపుగా 13 ఏళ్ల తర్వాత మళ్ళీ రంజీ ట్రోఫీలో ఆడబోతున్నాడు. కోహ్లీ 2012లో చివరగా రంజీ మ్యాచ్ ఆడాడు. దీంతో ప్రస్తుతానికి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ చివరిగా రంజీ మ్యాచ్ ఆడి 12 సంవత్సరాలు అవుతుంది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో ఆడబోతున్నాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. జనవరి 23 నుంచి మొదలయ్యే ఢిల్లీ, సౌరాష్ట్ర మ్యాచ్‌కు మెడనొప్పి కారణంగా విరాట్ అందుబాటులో ఉండట్లేదు. రైల్వేస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని కోహ్లీ తెలిపాడు.
రాహుల్ గాంధీకి ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు!..
కాబట్టి మనం పూర్వ విరాట్ కోహ్లీని ఈ రంజీ మ్యాచ్లో చూడవచ్చు. అయితే ఒకవైపు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ 12 సంవత్సరాల క్రితం ఆడినట్లు ఇప్పుడు కూడా ఆడాలని కోరుకుంటున్నారు. కాగా విరాట్ కోహ్లీ అప్పట్లో ఎన్నో మ్యాచులు చాలా బాగా ఆడి టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకొని ఇండియాకి ఎన్నో రికార్డులను తెచ్చిపెట్టాడు. తన ఖాతాలో ఎన్నో చెరపలేని రికార్డులను వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ తన ప్రతిభతో ఎన్నో మ్యాచులు ఒంటి చేతితో గెలిపించి ఇండియాకు సారథిగా నిలిచి ఎన్నో ట్రోఫీలను కూడా అందజేశాడు. అలాంటి విరాట్ కోహ్లీ ప్రస్తుతం మళ్ళీ రంజీ ట్రోఫీ లో ఆడడం అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.