క్రీడలు

ఇండియాను వీడనున్న కోహ్లీ!.. పూర్తిగా లండన్లోనే?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ త్వరలో పూర్తిగా లండన్ లోనే స్థిరపడునున్నారని తెలుస్తుంది. విరాట్ కోహ్లీ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన వెంటనే అతను పూర్తిగా లండన్ లోనే స్థిరపడతారంటూ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ తెలిపారు. కుటుంబంతో కలిసి విరాట్ కోహ్లీ తన విశ్రాంత జీవితాన్ని మొత్తం యూకే లోనే గడుపుతారు అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై ఒకప్పుడు పూర్తిగా అవగాహన లేకుండానే సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అయ్యాయి.

వర్షాలు నేపథ్యంలో స్కూళ్ల కు సెలవు ఇవ్వాలని డిమాండ్

విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్ లో తన ఫ్యామిలీ, తను ఉండడానికి మంచి ఇల్లు కొనుక్కున్నారని చెప్పాడు. త్వరలోనే విరాట్ కోహ్లీ ఫ్యామిలీ మొత్తం కూడా లండన్ కు షిఫ్ట్ అవుతారంటూ వెల్లడించారు. అయితే ఇటీవల కాలంలో కోహ్లీ ఖాళీ దొరికిందంటే లండన్ వెళ్ళిపోతున్నాడు. లండన్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలు కూడా చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్ కూడా లండన్ లోనే జన్మించిన విషయం మనందరికీ తెలిసిందే.

విగ్గు పెట్టుకుని అమ్మాయిలు మోసం చేస్తున్న గచ్చిబౌలి యువకుడు?

విరాట్ కోహ్లీ అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే కచ్చితంగా లండన్ లోనే తన పూర్తి జీవితాన్ని గడుపుతారు అంటూ సోషల్ మీడియాలో అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా పూర్తిగా నిరాశ చెందుతారు. ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్ముల ద్వారా విరాట్ కోహ్లీ ఇండియాలోనే ఉండాలంటూ చాలామంది కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇండియాలోనే ఉంటాడా లేక లండన్ వెళ్లిపోతారా అనేది వేచి ఉండాల్సిందే.

చావు బతుకుల మధ్య ఉన్న శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button