
VIRAL VIDEO: మొబైల్ ఫోన్ ఈ కాలంలో మనుషుల జీవితాలను ఏలుతున్న స్థాయికి చేరిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ గంటల తరబడి ఫోన్లలో మునిగిపోతున్నారు. ముఖ్యంగా ఈ తరం తల్లిదండ్రులకు పిల్లలు మొబైల్‌కు బానిసలైపోవడం పెద్ద సవాల్‌గా మారింది. పిల్లలు తినేటప్పుడు, బయటికి తీసుకెళ్లినప్పుడు, ఇంట్లో సైలెంట్‌గా ఉంచాలన్నా, మొబైల్ ఇవ్వక తప్పని పరిస్థితి చూస్తున్నారు. స్కూల్‌లో ఉన్న కొద్ది గంటలు తప్ప మిగతా సమయాల్లో పిల్లల చేతుల్లో ఫోన్ ఉంచాలి అనే పరిస్థితి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యసనం తగ్గించడానికి కొందరు వేర్వేరు పద్ధతులు ప్రయత్నిస్తుంటారు.
View this post on Instagram
అలాంటి సందర్భంలో ఒక తల్లి తన మూడేళ్ల బిడ్డను మొబైల్‌కు దూరం చేయడానికి వినూత్నమైన పద్ధతిని ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు తల్లి అతని కళ్ల చుట్టూ కాటుక పూసి, లేవగానే అద్దంలో తన ముఖం చూసుకోమని చెప్పింది. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కనిపించడంతో పిల్లాడు వెంటనే భయపడి ఏడవడం ప్రారంభించాడు. మొబైల్ ఎక్కువగా చూసే పిల్లలకు కళ్ల కింద నల్లటి మచ్చలు వస్తాయని నమ్మకాన్ని పెంచేలా ఆమె చూపించిన ఈ చిన్న డ్రామా ఆ బిడ్డను భయపెట్టినట్టే, తల్లిదండ్రుల దృష్టిని కూడా ఆకర్షించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిన కొద్ది గంటల్లోనే విపరీతమైన స్పందనను రాబట్టింది. ఇప్పటివరకు దాదాపు ఇరవై లక్షల మంది ఈ వీడియోను వీక్షించగా, ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి పైగా లైకులు కూడా వచ్చాయి. ఈ విధానం పిల్లను భయపెట్టి మరింత మనోభావాలను దెబ్బతీయవచ్చని కొందరు విమర్శిస్తుండగా, పిల్లలకు అర్థమయ్యే రీతిలో మొబైల్ వ్యసనం ప్రమాదాలను చూపించేందుకు ఇది ఒక తెలివైన ప్రయత్నమని మరికొందరు అభినందిస్తున్నారు. ఏదేమైనా, మొబైల్ ప్రభావం పిల్లలపై ఎంత తీవ్రమైందో ఈ వీడియో మరోసారి వెల్లడించింది.
ALSO READ: Technology: వామ్మొ.. ఈ కారు ధర రూ.230 కోట్లా!.. ఎందుకో తెలుసా?





