
Viral video: గుంటూరు జిల్లాలోని కూరగలు వద్ద చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బైక్‌పై నియంత్రణ కోల్పోయిన యువకుడు దురదృష్టవశాత్తు పక్కనే వస్తున్న టిప్పర్ వాహనం కింద పడ్డాడు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే టిప్పర్ వరుసగా రెండు టైర్లు అతని తలపై నుంచి దూసుకెళ్లడంతో పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. తీవ్ర గాయాలతో నేలపై ఉన్న యువకుడు కొంతసేపు ప్రాణం కోసం ప్రయత్నించినా, అక్కడికి చేరిన చాలామంది కేవలం చూస్తూ ఉండిపోయారు. సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అతను అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకొని సమాజం
గుంటూరు జిల్లా కూరగల్లులో ఓవర్ టేక్ చేస్తూ లారీ కింద పడ్డ బైకర్
బైకర్ తలపై నుండి దూసుకెళ్లిన లారీ రెండు టైర్లు
తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నా చూస్తూ ఉన్నారే కానీ పట్టించుకొని జనం
తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలిన బైకర్ pic.twitter.com/iBnPHob4QX
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2025
ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర బాధ వ్యక్తం చేస్తూ, ప్రాణం పోతున్నా పక్కనే ఉన్న ప్రజలు ముందుకు రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అంబులెన్స్‌కు అయినా కాల్ చేయాల్సింది కదా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాన్ని చూసినా సాయం చేయకపోవడాన్ని సమాజం ఎంత నిర్లక్ష్యంగా మారిందని నెటిజన్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు ‘దగ్గరకు వెళ్లితే కేసుల్లో ఇరికిస్తారనే భయం ఉండొచ్చు కానీ.. మానవత్వం ఎక్కడికి పోయింది’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ALSO READ: Hidden Cameras: హోటల్‌లో సీక్రెట్ కెమెరా ఉందనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి..





