
Viral: టాలీవుడ్ అభిమానుల ప్రేమ ఎంత దూరం వెళ్తుందో అందరికీ తెలిసిందే. ఇక్కడ హీరోలు కేవలం నటులు మాత్రమే కాకుండా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందిన వ్యక్తులు. తమ అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ ఏ స్థాయికైనా వెళ్లడం సహజమే. సేవా కార్యక్రమాలు చేయడం, పండుగల సమయంలో అన్నదానాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి ఎన్నో పనులు చేస్తూ తమ హీరోపైన ఉన్న భక్తిని చూపుతుంటారు. ఇలాంటి ఉదాహరణలు ఇప్పటికే అనేకసార్లు వార్తల్లోకి వచ్చాయి. కానీ ఇప్పుడు మహేష్ బాబు అభిమానిలో ఓ వ్యక్తి చేసిన పని మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించేలా ఉంది. తన హీరోపైన ఎవరూ విమర్శలు చేయకూడదనే ఆలోచనతో అతను చేసిన చర్య అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మహేష్ బాబు ప్రయాణించిన TS 36 N 4005 నెంబర్ కారు PVNR హైవేపై స్పీడ్ లిమిట్‌ను దాటడంతో అక్టోబర్ 4, అక్టోబర్ 15 తేదీల్లో రెండు ఓవర్ స్పీడ్ చలాన్లు జారీ అయ్యాయి. మొత్తం రూ.2070 ఫైన్ పడింది. వారణాసి ఈవెంట్ నేపథ్యంలో ఈ చలాన్ల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఈ అంశాన్ని ఉపయోగించి వివిధ కామెంట్లు చేస్తూ, పోస్టులు పెడుతూ ట్రోలింగ్‌కు కూడా దిగారు. ఈ పరిస్థితిని చూసిన మహేష్ బాబు వీరాభిమాని మాత్రం తట్టుకోలేకపోయాడు. తన హీరో పేరు ఎక్కడా దెబ్బతినకూడదనే ఉద్దేశంతో వెంటనే ఆ రెండు చలాన్లను స్వయంగా ఆన్‌లైన్‌లో చెల్లించి, ఎవ్వరూ మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు. ఈ విషయం బయటకు రాగానే నెటిజన్లు ఇదేంట్రా పిచ్చి అభిమానం అంటూ ఆశ్చర్యపోతున్నారు.
AlSO READ: Pumpkin Seeds: మీకు తెలుసా?.. పురుషులకు గుమ్మడి గింజలు ఓ వరమని..





