
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశి పట్టణంలో తరాలీ అనే గ్రామం భీకరమైన వరద ప్రవాహంలో మునిగిపోయింది. ఈరోజు ట్రెండింగ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి. ఎందుకంటే ఈ భీకరమైన వరద ప్రవాహ విలయంలో దాదాపు అన్ని ఇల్లు కూడా చెల్లా చెదురయ్యాయి. ఇప్పటికే నలుగురు మృతి చెందగా 50 మందికి పైగా గల్లంతయినట్లు సమాచారం అందింది. ఈ తరాలీ అనే గ్రామం మొత్తం కూడా బురదలో కూరుకుపోయింది. అయితే ఈ బురదలో ఉండిపోయిన ఇళ్లల్లో ఇంకా ఎంతోమంది చిక్కుకుపోయి ఉండవచ్చు అని అధికారులు తెలిపారు. దీన్నిబట్టి మృతుల సంఖ్య కూడా భారీగానే పెరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. వెంటనే NDRF మరియు SDRF బృందాలు రిస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టేసాయి.
Read also : తెలంగాణ గుండెకాయ కాళేశ్వరం
కాగా క్లౌడ్ బరస్ట్ దాటికి కొండ చరియలు మొత్తం విరిగిపడడంతో… భారీ ఎత్తున వరద ప్రవాహం వందలాది ఇళ్లను ముంచేత్తేసింది. ప్రజలు వాళ్ల ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ సందర్భంలోనే కొంతమంది ఇళ్లల్లోనే ఇరుక్కుపోయారు. ఇందుకు సంబంధించినటువంటి భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రజలు ఇళ్లలో ఇరుక్కుపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ముసలి వారితో పాటుగా చిన్న పిల్లలు కూడా ఉండడంతో.. కాపాడడానికి అధికారగా యంత్రాంగం అన్ని రకాలుగా సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతంలో ఆస్తి మరియు ప్రాణ నష్టం అనేది భారీగా వాటిల్లే అవకాశం ఉందని సమాచారం అందింది.
Read also : బండరాయికి హనుమాన్ విగ్రహం ఆకృతి.. భక్తిశ్రద్ధలతో పూజలు!