Monday, March 2, 2026
HomeజాతీయంActor Vijay: నిన్న భార్య‌, నేడు కొడుకు.. రోడ్డు పాలవుతున్న విజ‌య్ వ్యక్తిగత జీవితం!

Actor Vijay: నిన్న భార్య‌, నేడు కొడుకు.. రోడ్డు పాలవుతున్న విజ‌య్ వ్యక్తిగత జీవితం!

  • వివాదాల్లో హీరో విజయ్ వ్యక్తిగత జీవితం

  • భార్య, కొడుకు తీవ్ర ఆరోపణలు

  • విజయ్ రాజకీయ జీవితంపై పెను ప్రభావం తప్పదా?

తమిళ సినీ పరిశ్రమలో ఇళయ దళపతిగా అపారమైన ప్రజాదరణ సంపాదించిన విజయ్ కి తమిళనాట ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తర్వాత కోలీవుడ్‌లో అదే స్థాయి స్టార్డమ్‌ను అందుకున్న హీరోగా విజయ్ గుర్తింపు పొందారు. అయితే అటువంటి స్టార్‌డమ్‌ను పక్కనబెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి రావడం విజయ్ తీసుకున్న పెద్ద నిర్ణయం. ఈ నిర్ణయం తర్వాత ఆయనపై రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు, వ్యక్తిగత దాడులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే అభిమానులు మాత్రం ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.

విజయ్ పై భార్య, కొడుకు తీవ్ర ఆరోపణలు

ఇప్పటికే విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉంటుండగా, ఆయన వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. ఈ వార్తతో కోలీవుడ్‌తో పాటు అభిమాన వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా కుటుంబ సభ్యుల నుంచి స్పష్టత రాలేదు. ఇక తాజాగా.. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ సోషల్ మీడియాలో తన తండ్రిని అన్‌ఫాలో చేశాడు. ఇటీవ‌ల దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన జేసన్ సంజయ్‌ కి విజయ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో తండ్రినే అన్‌ఫాలో చేయడం కుటుంబంలో అంతర్గత విభేదాలపై అనుమానాలకు తావిస్తోంది.

ఆందోళనలో విజయ్ అభిమానులు

విజయ్ కుటుంబంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అనేది స్పష్టంగా తెలియకపోయినా, వరుసగా వస్తున్న వార్తలు అభిమానులని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత జీవితంలో మార్పుల‌తో విజ‌య్ ఇబ్బందులకి గుర‌వుతాడా అనేది చూడాలి. ప్ర‌స్తుతం అయితే విజయ్ తన రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు జేసన్ సంజయ్ కూడా దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ విషయాలపై ఆయన త్వరలోనే స్పందించే అవకాశం ఉంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments