Wednesday, March 4, 2026
Homeతెలంగాణరేవంత్ కేబినెట్‌లోకి విజయశాంతి, అద్దంకి దయాకర్?

రేవంత్ కేబినెట్‌లోకి విజయశాంతి, అద్దంకి దయాకర్?

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు సంబంధించి రాజకీయ వేడి పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు విజయశాంతి మరియు అద్దంకి దయాకర్‌ కేబినెట్‌లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వారిద్దరూ ఇటీవల ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్ను న్యూఢిల్లీ లో కలిసినట్లు సమాచారం. ఈ భేటీ కీలకంగా మారింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, విజయశాంతి బీసీ కోటాలో మంత్రి పదవి కోరినట్టు తెలుస్తోంది. అదే సమయంలో అద్దంకి దయాకర్‌ కూడా తనకు కేబినెట్‌లో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

రాష్ట్రంలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని కేబినెట్‌లోకి తీసుకోవాలని పార్టీ ఉద్ధేశ్యంతోనే వీరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రేణుకా చౌదరి, తుమ్మిదీతి జయశ్రీ వంటి నేతలతోపాటు విజయశాంతికి కూడా కీలక పాత్ర ఇస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, త్వరలోనే కేబినెట్ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments