Wednesday, February 25, 2026
Homeజాతీయంవిజయ్ రష్మిక మ్యారేజ్.. మోడీ విషెస్

విజయ్ రష్మిక మ్యారేజ్.. మోడీ విషెస్

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- వెండితెర నటులు విజయ్ దేవరకొండ,రష్మిక మందన రేపు రాజస్థాన్లోని ఉదయపూర్ లో అతి కొద్ది మంది బంధువులు మరియు మిత్రుల పక్షంలో పెళ్లి చేసుకోబోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పెళ్లి రేపు జరగబోతుంది అనగా నేడే ఎంతోమంది సినిమా మరియు రాజకీయ ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధానమంత్రి మోడీ సైతం విజయ్ రష్మిక జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఇరు కుటుంబాలకు నరేంద్ర మోడీ విషెస్ తెలియజేశారు. అలాగే విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ఇద్దరికీ వైవాహిక జీవితం వెండితెర మ్యాజిక్ కంటే అద్భుతంగా ఉండాలి అని.. వీటన్నిటికంటే జీవితాంతం కూడా స్నేహితులుగా కలిసి మెలిసి ఉండాలి అని నరేంద్ర మోదీ లేక ద్వారా ఆశీర్వదించారు.

కొద్దిరోజుల క్రితం విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వివాహానికి రావాలి అని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ లేఖ ద్వారా స్పందిస్తూ వారిద్దరిని ఆశీర్వదించారు. కాగా వీరిద్దరి పెళ్లి రేపు రాజస్థాన్లోని ఉదయపూర్ లో చాలా ఘనంగా జరగనుంది. మరోవైపు మార్చి మూడవ తేదీన రిసెప్షన్ ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వారి మిత్రులు అలాగే ప్రముఖ సెలబ్రిటీలను ఆహ్వానించునున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా వీరిద్దరి ఆస్తులు కలిపి దాదాపు 150 కోట్లకు పైగానే ఉంది అని సమాచారం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments