
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- విజయ్ హజారే ట్రోఫీలో భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం జరిగింది. ముంబై తరుపున రోహిత్ శర్మ, ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరికీ ఈ టోర్నీలో ఆడినందుకుగాను మ్యాచ్ కు ఎంత శాలరీ ఇస్తున్నారు అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా ఈ ట్రోఫీ నిర్వాహకులు తెలిపిన విషయం ప్రకారం లిస్టు-A మ్యాచ్ల ప్రకారం 40 సంవత్సరాలకు మించి ఆడిన సీనియర్ క్యాటగిరి క్రికెటర్లకు ఒక్క మ్యాచ్కు 60 వేల రూపాయలు ఇస్తారు. అదే రిజర్వులో ఉంటే 30 వేల రూపాయలు చెల్లిస్తారు. దీన్నిబట్టి చూసుకుంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు సీనియర్ కేటగిరి ప్లేయర్లే కాబట్టి వీరికి ఒక మ్యాచ్ కు గాను 60 వేల రూపాయలు శాలరీ గా తీసుకుంటారు.
Read also : శివాజీ – అనసూయ మధ్య కోల్డ్ వార్.. మధ్యలోకి దూరిన ప్రకాష్ రాజ్?
ఇక ఐపీఎల్ మ్యాచ్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ అయినప్పటికీ కూడా దేశి వాలి క్రికెట్ లో వీరికి ఇది మంచి ఫీజు అనే చెప్పుకోవచ్చు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు గాను అది ఏ ప్లేయర్ అయినా సరే పదివేల రూపాయలు చెక్ ఇస్తారు. తాజాగా విరాట్ కోహ్లీ సైతం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పదివేల రూపాయలు తీసుకున్నారు. దీంతో విరాట్ కోహ్లీకి పదివేల రూపాయలు ఎక్కడ అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా నవ్వుకుంటున్నారు. అయినప్పటికీ దేశి వాలి క్రికెట్ ను ఎంకరేజ్ చేయడానికి వీరిద్దరూ సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నందుకుగాను ఎంతోమంది వీరి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత దిగ్గజ క్రికెటర్లు అయినటువంటి వీరు డబ్బుల కోసం కాకుండా ఫ్యాన్స్ కోసం, దేశం కోసం ఎప్పుడు ముందుంటారు అని ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తు పొగిడేస్తున్నారు.
Read also : Rare Condom: రూ.44 వేలకు వేలంలో అమ్ముడుపోయిన 200 ఏళ్ల నాటి కండోమ్





