తెలంగాణ

విచారణ చేపట్టిన విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు..

మాదాపూర్, క్రైమ్ మిర్రర్ :-మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ విజిలెన్స్అధికారులు. అయ్యప్ప సొసైటీలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. విద్యుత్ విజిలెన్స్ సీఐ రామకృష్ణ ఇతర అధికారులు అయ్యప్ప సొసైటీలో విచారణ చేపట్టారు. సరైన పత్రాలు లేకుండానే విచ్చలవిడిగా కరెంట్ మీటర్లు ఇచ్చారని, నిర్మాణాలు అయిన బిల్డింగ్ లకు కూడా ఓసీ ఇవ్వకుండానే అక్రమంగా కనెక్షన్లు ఇచ్చారని అధికారుల దృష్టికి వచ్చింది. విద్యుత్ కనెక్షన్ల విషయంలో అధికారులు భారీగా ముడుపులు తీసుకున్నారని, సుప్రీంకోర్టు ఆర్డర్ సైతం బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ మీటర్లు ఇచ్చేందుకు లక్షల్లో వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read also : సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ.. వ్యూహమేంటి..?

అక్రమ నిర్మాణాలకు కరెంట్ మీటర్ల మంజూరు విషయంలో లైన్ మెన్ల నుండి ఏఈ, డీఈ, ఎస్ ఈ స్థాయి అధికారుల వరకు పాత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. ఒక్కో స్తంభానికి ఇంత అంటూ రేట్ కట్టి, మీటర్ల మంజూరు కోసం భారీ వసూళ్లు పాల్పడ్డారని, సుప్రీంకోర్టులో కేసులో ఉన్న భూముల్లో కట్టిన నిర్మాణాలకు ఎలా మీటర్లు మంజూరు చేశారు. అంటే.. నిర్మాణదారులు అపిడవిట్ ఇచ్చారంటూ విద్యుత్ సిబ్బంది తప్పించుకునేందుకు చూస్తుండడం గమనార్హం. అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న విద్యుత్ విజిలెన్స్ విచారణలో విద్యుత్ అధికారుల డొంక కదులుతోంది. బడా బిల్డర్ల దగ్గర భారీగా డబ్బుల వసూళ్లకు పాల్పడినబిల్డర్ల దగ్గర భారీగా డబ్బుల వసూళ్లకు పాల్పడిన విద్యుత్ సిబ్బంది అరాచకాలు విజిలెన్స్ విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అలాగే అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణలపై త్వరలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ విచారణకు అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read also : విద్యార్థులకు శుభవార్త… 21 నుంచి దసరా సెలవులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button