క్రైమ్జాతీయంవైరల్

(VIDEO): ప్రిన్సిపల్‌తో టీచర్ ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

విద్యార్థులకు నీతి, క్రమశిక్షణ, జీవన విలువలు నేర్పాల్సిన గురువులే బాధ్యత మరిచి ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.

విద్యార్థులకు నీతి, క్రమశిక్షణ, జీవన విలువలు నేర్పాల్సిన గురువులే బాధ్యత మరిచి ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. పాఠశాల ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తి, అదే స్కూల్‌కు చెందిన మహిళా టీచర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, పని వేళల్లోనే హోటల్‌కు వెళ్లిన వ్యవహారం బయటపడింది.

ఉత్తరప్రదేశ్ అమేథీ జిల్లాలోని బేటువా కాంపోజిట్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్.. అక్కడే పనిచేస్తున్న మహిళా టీచర్ మధ్య కొంతకాలంగా అనుచిత సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. ఇద్దరూ ఒకే రోజు స్కూల్‌కు హాజరు కాకపోవడంతో మహిళా టీచర్ భర్తకు అనుమానం మొదలైంది. తన భార్య కదలికలపై నిఘా పెట్టిన అతడు, చివరకు అసలు నిజాన్ని తన కళ్లతోనే చూసే పరిస్థితి వచ్చింది.

అనుమానం బలపడడంతో ఆమె భర్త ఇద్దరినీ వెంబడించాడు. చివరకు వారు ఓయో హోటల్‌కు వెళ్లినట్టు గుర్తించాడు. హోటల్ వద్దకు చేరుకున్న వెంటనే అక్కడ జరిగిన దృశ్యాలు మరింత ఉద్రిక్తతకు దారి తీశాయి. భార్యను ప్రత్యక్షంగా పట్టుకున్న ఆ భర్త ఆగ్రహంతో ఆమెపై దాడి చేశాడు. రోడ్డుపైనే జరిగిన ఈ గొడవను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న కొందరు వీడియోలు తీశారు. ఈ వీడియోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గురువులే ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా వ్యవహరించడం సమాజానికి తప్పు సంకేతాలు పంపుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విషయం పెద్ద దుమారం రేపడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించారు. ప్రాథమిక విచారణ అనంతరం స్కూల్ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా టీచర్ వ్యవహారంపై కూడా విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇద్దరూ డ్యూటీ టైంలోనే స్కూల్‌కు గైర్హాజరై హోటల్‌కు వెళ్లారా, లేక సెలవు తీసుకున్నారా అనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు.

ఈ ఘటన విద్యా శాఖ ప్రతిష్టను మసకబార్చేలా మారిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు విద్యార్థులకు భవిష్యత్తు నిర్మించే స్థలాలని, అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నత విలువలు పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత వారిపై కఠిన చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నా.. విధి నిర్వహణలో మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై తుది నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ALSO READ: Weather: పంజా విసురుతున్న చలి.. రెండు రోజులు జాగ్రత్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button