
రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోటల్ ముసుగులో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయనే పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా రైడ్స్ నిర్వహించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం కొనసాగుతోందన్న అనుమానాల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.
कौशल इंटरनेशनल होटल, सांचोर….!!!
IG के निर्देशन में हुई कार्रवाई….!!
17 युवतियाँ गिरफ़्तार…!!!
ये ऐसे काम करने में शर्म नहीं आती…
तो बाहर मुँह ढँककर, ये शर्म का नाटक क्यों…?? pic.twitter.com/qXaPtoGrw3
— kapil bishnoi (@Kapil_Jyani_) December 17, 2025
పోలీసుల ఆకస్మిక దాడులతో హోటల్ సిబ్బంది, అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రూమ్ టు రూమ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్న మహిళలను గుర్తించారు. ఈ తనిఖీల్లో దాదాపు 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో ఈ హోటల్‌ను కేంద్రంగా చేసుకుని వ్యభిచార రాకెట్ నడుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ నిర్వాహకులు, మధ్యవర్తులు కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మరికొందరు ప్రమేయం ఉన్నారేమోనని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఈ రైడ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు యువతులను హోటల్ నుంచి బయటకు తీసుకొచ్చే దృశ్యాలు, అక్కడి పరిస్థితులు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. వీడియోలు బయటకు రావడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజస్థాన్ పోలీసులు స్పష్టం చేశారు. హోటళ్ల పేరుతో ఇలాంటి కార్యకలాపాలు సాగితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. మహిళలను మోసం చేసి లేదా బలవంతంగా ఈ రాకెట్‌లోకి నెట్టిన అంశాలపై ప్రత్యేకంగా విచారణ చేస్తామని అధికారులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ALSO READ: HEALTH TIP: పొద్దున్నే ఇవి తింటే.. వందేళ్ల ఆరోగ్యం





