తెలంగాణ

మెడికల్ లోపాల పై ఒంటరి పోరాటం చేస్తూ ఎనిమిదేళ్లకు విజయం..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- సాధారణంగా మెడిసిన్ తయారీ అనేది కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో కూడుకున్న విషయం. అలానే పెద్ద పెద్ద నాయకులు లేదా పెద్ద పెద్ద డబ్బున్న వ్యక్తులు ఈ వ్యవహారంలో భాగమై ఉంటారు. అలాంటప్పుడు సామాన్య ప్రజలు వీరిపై కానీ లేదా ఈ మెడిసిన్ ఉత్పత్తిలో జరిగే లోపాలపై ప్రశ్నించేందుకు ఎవరూ కూడా ముందుకు రారు. అలాంటి సమయంలో ఒకే ఒక మహిళా దాదాపు 8 ఏళ్లుగా సుదీర్ఘంగా పోరాడి చివరికి విజయం సాధించారు. WHO అనే ఫార్ములా కాకుండా షుగర్ డ్రింక్స్ ను ORS గా మార్కెటింగ్ చేస్తున్న కంపెనీలపై హైదరాబాద్ వైద్యురాలైనటువంటి శివరంజని అనే మహిళ ఒంటరిగా పోరాటం చేయడానికి ముందడుగు వేశారు. ఆమె అనుకున్నట్టుగానే దాదాపు 8 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేసి చివరికి వీళ్ళపై విజయం సాధించారు. ఈమె చేసినటువంటి ధైర్యసాహసాలను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. ఇలాంటి మహిళా డాక్టర్లు మన రాష్ట్రంలో మరింత మంది తయారవ్వాలని… అలాంటప్పుడే ఫేక్ మెడిసిన్ ఉత్పత్తులు లేదా లోపాలు జరగకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఈమె పోరాటం చేసినందుకుగాను WHO ఆమోదం పొందిన ఉత్పత్తులు మాత్రమే ORS పేరును ఉపయోగించాలని తాజాగా FSSAI ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇతర బ్రాండ్లు ఎవరైనా కానీ ORS లేబుల్ ముద్రించవద్దు అని హెచ్చరించింది. ఈ ప్రకటనలతోనే దాదాపు కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ మహిళా డాక్టర్ శివరంజని చాలా ఎమోషనల్ అయ్యారు. చివరికి మీ అందరి వల్లే ఈరోజు ఈ విజయం సాధ్యమైంది అని ఆమె కన్నీళ్ళతో ఎమోషనల్ అయ్యారు.

Read also : బీసీ బంద్ లో పాల్గొని రాజకీయ నాయకులని షేక్ చేసిన కవిత వారసుడు..!

Read also : బంద్ ఎఫెక్ట్… దీపావళి, దుకాణదారుల పై ప్రభావం చూపుతోందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button