జాతీయం

మ‌న రాకెట్‌.. మ‌న ఆస్ట్రోనాట్.. శుభాంశు శుక్లా కీలక ప్రకటన!

Shubhanshu Shukla: మనం త‌యారు చేసిన‌ రాకెట్‌, క్యాప్సూల్‌ లో  మన వ్యోమ‌గామి అంత‌రిక్షంలోకి వెళ్లే రోజు త్వ‌ర‌లో వ‌స్తుంద‌ని ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా తెలిపారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తో కలిసి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన.. గ‌న్‌యాన్‌, భార‌త అంత‌రిక్ష కేంద్రం కోసం ఎక్స్ పీరియెన్స్ ఉపయోగపడుతుందన్నారు. అంత‌రిక్ష కేంద్ర అనుభ‌వం ఎంతో విలువైనది చెప్పిన ఆయన, అక్క‌డ ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు. అంత‌రిక్షం నుంచి భార‌త్ అద్భుతంగా క‌నిపిస్తున్న‌ద‌న్నారు. 1984లో ఆస్ట్రోనాట్ రాకేశ్ శ‌ర్మ చెప్పినట్లు సారే జ‌హాసే అచ్చా అన్న రీతిలోనే ఇండియా ఇప్ప‌టికీ ఉన్న‌ట్లు శుక్లా తెలిపారు.

ఆక్సియం-4 మిష‌న్ కు మిష‌న్ పైలట్‌గా చేసిన‌ట్లు చెప్పిన శుభాన్షు.. క్రూ డ్రాగ‌న్ క్యాప్సూల్‌ లో మొత్తం నాలుగు సీట్లు ఉంటాయ‌న్నారు. మిష‌న్‌ కు పైల‌ట్ కావ‌డం వ‌ల్ల‌ క‌మాండ‌ర్‌ తో ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత క్రూ డ్రాగ‌న్ సిస్ట‌మ్స్‌ తో ఇంట‌రాక్ట్ కావాల్సి ఉంటుంద‌న్నారు. భార‌తీయ ప‌రిశోధ‌కులు అభివృద్ధి చేసిన ప్ర‌యోగాల‌ను అక్క‌డ ప‌ర్ఫార్మ్ చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. స్టెమ్ డెమోలు, ఫోటోలు తీయ‌డం, వీడియోలు తీయ‌డం కూడా చేసిన‌ట్లు తెలిపారు. శిక్ష‌ణ పొందిన దాని క‌న్నా ఎక్కువ‌గా మాన‌వ అంత‌రిక్ష మిష‌న్‌ను హ్యాండిల్ చేయాల్సి వ‌స్తుంద‌న్నారు.

భారత అంతరిక్ష యాత్రలకు ఎంతో ఉపయోగం

ఆక్సియం-4  మిష‌న్‌లో భాగం కావ‌డం వ‌ల్ల వ‌చ్చే జ్ఞానం వెల‌క‌ట్ట‌లేనిద‌న్నారు శుక్లా. మ‌న దేశం చేప‌ట్టే అంత‌రిక్ష ప్ర‌యోగాల‌కు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గ‌గ‌న్‌ యాన్‌ తో పాటు భార‌తీయ అంత‌రిక్ష కేంద్రం ప్రాజెక్టులో త‌న అభ‌వ‌నం కీలకంగా మారే అవకాశం ఉందన్నారు. గ్రౌండ్‌ లో పనిచేసిన అనుభం, అంతరిక్షంలో అనుభవం చాలా భిన్నంగా ఉంటుంద‌న్నారు. అంత‌రిక్ష ప్ర‌యాణ స‌మ‌యంలో మాన‌వ శ‌రీరం చాలా మార్పుల‌కు లోన‌వుతుంద‌న్నారు. 20 రోజుల పాటు అంత‌రిక్షంలో ఉంటే, అప్పుడు శ‌రీరాన్ని ఎలా గురుత్వాక‌ర్ష‌ణ‌లో ఉంచాల‌న్న విష‌యాన్ని మ‌రిచిపోతుంద‌ని శుక్లా చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button