
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మరియు చంద్రబాబు మధ్య రాజకీయం ఒక ఎత్తు అయితే.. పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ మరియు వర్మ మధ్య రాజకీయం మరో ఎత్తు. ఈ రెండు విషయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ ఉంటాయి. నిన్న మొన్నటి వరకు.. పవన్ కళ్యాణ్ మరియు వర్మ మధ్య సన్నిహిత్యం ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో పిఠాపురంలో జనసేన మరియు టిడిపి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇందులో ఏముంది ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అని మీరు అనుకోవచ్చు… కానీ ప్రస్తుతం వర్మ వైసీపీలోకి చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చాలానే వస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ను.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలవడం జరిగింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
Read also : గురుకులంలో తిండి లేక.. కలెక్టర్ కోసం గోడ దూకిన 70 మంది విద్యార్థులు
అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని గతంలో ముద్రగడ పద్మనాభం ప్రతిజ్ఞ కూడా చేశారు. కానీ ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం… అందులో వర్మ కూడా కీలకపాత్ర పోషించడం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ మరియు జనసేన మధ్య విభేదాలనేవి తలెత్తుతున్నాయి. ఇలాంటి విభేదాల నేపథ్యంలో వర్మ వెళ్లి వైసీపీ నేత ముద్రగడను కలవడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు వర్మ.. ఎందుకు కలిశారో కూడా తెలియదు. కానీ ఇప్పుడు రాష్ట్రమంతటా కూడా ఈ విషయం గురించే చర్చిస్తున్నారు. వైసీపీ పార్టీలోకి చేరడానికే వర్మ ముద్రగడను కలిసినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా రేపు ఉదయం 11 గంటలకు వైసీపీ పార్టీలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాబోతున్నారన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసిపి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు కూడా పెడుతూ హైలెట్ చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది వర్మ మీడియా ముందుకు వచ్చి అసలు నిజం తెలిపితే గాని ఎవరికి అర్థం కాదు. ఎవరో ఒకరు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేంతవరకు రాష్ట్రంలో ఇది హైలెట్ టాపిక్ గానే ఉంటుంది.
Reas also : యువత మరణాలకు కారణాలు ఇవే!.. ‘వన్ లైఫ్’ సంచలన విషయాలు