తెలంగాణరాజకీయం

వెంకట్ రెడ్డి, కొండా, జూపల్లి అవుట్? కొత్తగా ఆరుగురికి అవకాశం!

మంత్రివర్గ విస్తరణ ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం పక్కాగా ఉందంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, మహేశ్ గౌడ్ తో జరిగిన చర్చల్లో కొత్త మంత్రులను రాహుల్ గాంధీ ఖరారు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఉగాది రోజున మంత్రివర్గంలో కొత్త వారిని తీసుకునేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీస చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 17 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంత్రులు ప్రమాణం చేశారు. మరో ఆరుగురికి కేబినెట్ లో అవకాశం ఉంది.

మంత్రివర్గ విస్తరణ ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం పక్కాగా ఉందంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, మహేశ్ గౌడ్ తో జరిగిన చర్చల్లో కొత్త మంత్రులను రాహుల్ గాంధీ ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే కేబినెట్ కూర్పూ ఊహించని విధంగా ఉంటుందంటున్నారు. ప్రస్తుత మంతివర్గంలోని ఇద్దరు లేదా ముగ్గురి తప్పించవచ్చని సమాచారం.కొత్తగా ఆరుగురుకి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. రెండు లేదా మూడు మంత్రివర్గ స్థానాలను మరికొన్ని రోజుల వరకు పెండింగ్ పెట్టనున్నారని ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.ప్రస్తుత మంత్రివర్గంలోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

కొండా సురేఖ తరుచూ వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ సమంతతో పాటు టాలీవుడ్ తారలపై కొండా చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ గాంధీకి ఆమెపై ఫిర్యాదులు వెళ్లాయి. ప్రియాంక కూడా కొండాపై సీరియస్ అయ్యారనే టాక్ వచ్చింది. దీంతో కేబినెట్ నుంచి కొండాను తప్పించడం ఖాయమని అంటున్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పని తీరు, ఆయన ప్రకటనలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయనే టాక్ గాంధీభవన్ లో వస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగినా.. జిల్లా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి దుబాయ్ వెళ్లడం.. అక్కడ హోటల్ లో పార్టీ చేసుకుంటున్న విజువల్స్ బయటికి వచ్చి వైరల్ గా మారాయి. టన్నెల్ ప్రమాదంపై కోమటిరెడ్డి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. అంతేకాదు ఆయన తాగి మాట్లాడుతున్నారనే టాక్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచే వస్తోంది. కోమటిరెడ్డి తీరుపై గుస్సాగా ఉన్న హైకమాండ్ .. ఆయనను తప్పించాలని డిసైడ్ అయిందంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు ఆశించినంతగా పని చేయడం లేదనే రిపోర్ట్ హైకమాండ్ కు వెళ్లిందంటున్నారు. జూపల్లి వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నారంటున్నారు. కేసీఆర్ ఫ్యామిలీతో ఆయనకు ఇంకా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్నాయి. మొత్తంగా ఈ ముగ్గురు మంత్రులపై వేటు కత్తి వేలాడుతోందని తెలుస్తోంది.

Also Read : కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.

కొత్తగా తీసుకునే ఆరుగురు విషయానికి వస్తే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ ఖాయంగా తెలుస్తోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో తిరిగి చేరినప్పుడే ఆయనకు మంత్రిపదవి హామీ ఇచ్చింది హైకమాండ్. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని సమాచారం. కేబినెట్ నుంచి అన్న వెంకట్ రెడ్డిని తప్పించి.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయం జరిగిపోయిందని సమచారం. ఇప్పటివరకు మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చోటు లేదు. దీంతో నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయమైందని టాక్. తనకు అత్యంత సన్నిహితుడైన సుదర్శన్ రెడ్డి కోసం హైకమాండ్ దగ్గర గట్టిగా పోరాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి ఖయాం. జూపల్లిని తొలగిస్తే.. అదే సామాజికవర్గానికి చెందిన ప్రేమసాగర్ రావుకు లైన్ క్లియర్ అయినట్లే. తనకు గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని వివేక్ పట్టుబడుతున్నారు. దీంతో ఆయనకు కూడా మంత్రిపదవి ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉందంటున్నారు.

Also Read : ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజగోపాల్ రెడ్డితో పాటు ఈ ఐదుగురికి పక్కా?

బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్ కు బెర్త్ ఖాయమే. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఆశిస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. శ్రీహరి విషయంలో రేవంత్, భట్టి, ఉత్తమ్ ఏకాభిప్రాయంగా ఉన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన జూపల్లిని తప్పిస్తే.. జిల్లా కోటాలో శ్రీహరికి ఛాన్స్ ఇవ్వాల్సిందే. మున్నురు కాపు కోటాలో వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ రేసులో ఉన్నారు. ఆయన పేరును సీరియస్ గానే పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతి కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. బీసీ కోటాలో కొండా సురేఖను తీసేసి ఆమె స్థానంలో విజయశాంతికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయిందని తెలుస్తోంది.

దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రిపదవి రేసులో ఉన్నా.. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఆయనకు అవకాశం ఉండకపోవచ్చు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మల్ రెడ్డి ఉన్నారు. ఆయన తనకు అవకాశం ఇవ్వాల్సిందే అంటున్నారు. అయితే సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే మల్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లే. కేబినెట్ సాధ్యం కాని పక్షంలో ఆయనకు చీఫ్ విప్ పదవి ఇస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా కోటాలో మాత్రం ఎమ్మెల్సీ అలీఖాన్ రేసులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. LRSపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..రిజెక్ట్ చేసిన వారికి అపిలేట్ అధారిటిలో ఆపిల్

  2. నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ?

  3. నెల రోజులైనా దొరకని కార్మికులు..SLBC టన్నెల్ క్లోజేనా?

  4. ప్రేమించిన యువతి మృతి చెండడంతో- మనస్థాపంతో యువకుడి ఆత్మహత్యయత్నం

  5. జులైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు – ఆ తర్వాత స్థానిక సంస్థలకు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button