
క్రైమ్ మిర్రర్, వేములపల్లి:- నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఎస్సై డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా నూతన సంవత్సరం సందర్భంగా స్పెషల్ డ్రైవ్ ను గత రెండు రోజులుగా వెహికల్ చెకింగ్ తో పాటు రాత్రి సమయంలో ముఖ్యమైన కూడళ్లలో మరియు పబ్లిక్ స్థలాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది అని ఎస్ఐడి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా వేములపల్లి ఎస్సై మాట్లాడుతూ… నిన్నటి (మంగళవారం) రోజున నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో పది మంది వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఐదుగురు వ్యక్తులపై ఓపెన్ బూజింగ్ కేసులు నమోదు చేశామన్నారు. వీరిపై ఒక్కొక్కరికి 10,000/- రూపాయల వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. కావున ఎవరు కూడా రాత్రివేళలో తాగి రోడ్లమీద వాహనాలు నడపొద్దని అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, పార్టీలు చేసుకోవడం చేయొద్దని సూచించారు.

కిరాణా షాపు యజమానులకు పోలీసుల విజ్ఞప్తి
నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండగల సందర్భంగా కైట్స్ ఎగురవేయడం కోసం చైనా మాంజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీయొక్క షాపులలో అమ్మకూడదు, వాటిని వాడినచో తీవ్రంగా గాయపడే అవకాశం ఉన్నందున మీరు ఎట్టి పరిస్థితిలోనూ చైనా మాంజాలు అమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇట్టి హెచ్చరికలను పట్టించుకోకుండా చైనా మాంజ లు అమ్మినట్లయితే మీపై చట్టపరమైన చర్య తీసుకుంటామని ఎస్సై డి.వెంకటేశ్వర్లు తెలిపారు.

Read also : వంట గదిలోని ఈ 3 వస్తువుల వల్ల క్యాన్సర్ ముప్పు.. వెంటనే బయట పడేయండి





