
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:-విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. పండుగల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జాతీయ రహదారిపై వాహనాల కదలిక మందగించింది. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విజయవాడ వైపు 11 టోల్ బూత్‌లు, హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్‌లను ఒకేసారి తెరిచి ఉంచారు. ప్రతి మూడు సెకన్లకు ఒక వాహనం కదిలేలా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ నిర్వహణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Read also : శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ జిల్లా రథసారధి ఊట్కూరి అశోక్ గౌడ్
నిన్న ఒక్కరోజే లక్షకు పైగా వాహనాలు ఈ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించినట్లు అంచనా. ఇదే సమయంలో పండుగల కారణంగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో బస్టాండులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ట్రాఫిక్ పోలీస్ శాఖతో పాటు జాతీయ రహదారి అధికారుల సమన్వయంతో రద్దీని త్వరగా తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులు సహనం పాటించి ట్రాఫిక్ నిబంధనలు అనుసరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే సమయంలో ఆయా బస్టాండ్లు లేదా రైల్వే స్టేషన్లలో దొంగల ఉండేటువంటి అవకాశాలు ఉండడంతో మీ వస్తువుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు.
Read also : Good News: సంక్రాంతి కానుకగా మరో రెండు కొత్త పథకాలు..!





