
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- ప్రభుత్వ నిషేధిత నాటు సారా, బెల్లం తదితర మత్తు కలిగించే పదార్థాలు తరలిస్తూ ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలను మంగళవారం జిల్లా ఎక్సైజ్ అధికారిని గాయత్రి ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎక్సైజ్ కార్యాలయంలో వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్ణీత రుసుము చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని వెంకటరెడ్డి పేర్కొన్నారు.ఈ మధ్యకాలం చాలా మంది నాటుసారా వంటివి అక్రమంగా తరలిస్తూ తప్పులు చేయడంతో పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు నిర భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ చేయకుండా తనిఖీల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మరి వాహనాలను కూడా చేస్తామని పోలీసులు తెలిపారు.
Read also: జగిత్యాల కలెక్టరేట్‌లో అమానవీయ ఘటన
Read also : వార్-2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. తారక్ మాటలకు ఫ్యాన్స్ ఫిదా!