
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడకపోవడం వల్ల పంట దిగుబడిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో కేజీ పచ్చిమిర్చి ₹100గా ఉంది. ఒక్క పచ్చిమిర్చి కాకుండా మిగిలిన కూరగాయలు కూడా చాలానే రేట్లు పలుకుతున్నాయి. బీన్స్ 90 రూపాయలు, చిక్కుడు కిలో 50-70 రూపాయలు, క్యాప్సికం 75 రూపాయలు, టమాటా 50 రూపాయలు, బెండకాయ 45 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో ఇప్పటివరకు సామాన్య రైతులు వారం తిరిగే లేపు 500 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తుండగా.. ఇప్పుడు ఏకంగా 500 రూపాయలకు పైగా వెచ్చించాల్సి వస్తుంది.
పల్లెటూర్లలో బతికే ప్రజల కన్నా సిటీలలో బతికే ప్రజలు కూడా ఈ కూరగాయల రేట్లు ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక నెల తిరిగేసరికి సామాన్య రైతులు కూరగాయల ధరలకు సాధారణం కంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం వల్ల.. కూరగాయల పంటలు చాలా నష్టపోయాయి. ఈ కూరగాయల పంటలు పండించేటువంటి రైతులు కూడా బాగానే నష్టపోయారు. పెరిగిన కూరగాయల ధరలను చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ప్రతి సంవత్సరం కూడా కూరగాయలు పండించినటువంటి రైతులు సరైన లాభాలు రాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి.
ఏపీలో ప్రశ్నార్థకంగా రాజ్యాంగం: వైఎస్ జగన్‌కన్నుమూసిన రవితేజ తండ్రి… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!