
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక చేదు వార్త. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే నేడు వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి మరొక ముప్పు పొంచి ఉందని తెలిపారు. అదే వాయుగుండం.. ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని రెండు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని పేర్కొన్నారు. వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం 8 గంటల లోపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలు :-
1. నిర్మల్
2. నిజామాబాద్
3. మహబూబాబాద్
4. వరంగల్
5. హనుమకొండ
6. సిద్దిపేట
7. జనగాం
8. యాదాద్రి
9. మెదక్
10. కామారెడ్డి
11. ఉమ్మడి మహబూబ్ నగర్
పైన పేర్కొన్న ఈ 11 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేడు వాయుగుండం గా మారడం వలన మన రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. కాబట్టి వాహనదారులు కూడా చాలా జాగ్రత్త గా ఉండాలని.. అవసరమైతే తప్పు బయటకు వెళ్ళద్దని అధికారులు సూచించారు. మరోవైపు సెలవల కారణంగా పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాలని.. బయటకు , కరెంట్ స్తంభాల వైపు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.
Read also : DSC ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త టీచర్లు అలర్ట్!
Read also : ఎవరు ఏమైపోయినా పర్లేదు అంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు?