
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం ప్రభావం కారణంగా రేపు నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA కీలక ప్రకటన విడుదల చేసింది. కాబట్టి నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల ప్రజలు రేపు మరియు ఎల్లుండి వీలైనంత అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు తెలిపారు. ఇక మరోవైపు….
1. కృష్ణ
2. ఎన్టీఆర్
3. గుంటూరు
4. బాపట్ల
5. పల్నాడు
6. ప్రకాశం
పైన పేర్కొన్న ఈ ఆరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ద్విత్వ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అది భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణమైతే చాలా ప్రశాంతంగా.. మబ్బులు కొమ్ముకుని ఉన్నాయి. ఇక సాయంత్రానికి భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీని ద్వారా ప్రజలందరూ కూడా చలికి వణికి పోతూ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Read also : CBN: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. చేనేత, పవర్ లూమ్స్‌కు ఫ్రీ కరెంట్
Read also : CBN: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. చేనేత, పవర్ లూమ్స్‌కు ఫ్రీ కరెంట్





