సినిమా

Varanasi: రాజమౌళి-మహేష్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?

Rajamouli-Mahesh Babu Film Title Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు- టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కలిసి ఓ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు ఏడాది క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైనా, ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాలేదు. ఈ సినిమాలోని నటీనటుల వివరాలకు కూడా వెల్లడి కాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రిలీజ్ కార్యక్రమం ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది.

‘వారణాసి’గా టైటిల్ ఫిక్స్

‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ లో ఈ సినిమాకు సంబంధించిన పేరును దర్శకుడు రాజమౌళి రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘వారణాసి’ అని పెట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో అందరినీ మెస్మరైజ్ చేసింది. మూడున్నర నిమిషాల పాటు సాగిన ఈ వీడియో ఓ రేంజ్ లో ఉంది. విజువల్స్, గ్రాఫిక్స్ మతిపోగొట్టేశాయి. వారణాసి నుంచి మొదలుపెట్టి.. ఆస్టరాయిడ్ శంభవి 2027.. అంటార్కిటికా ఆఫ్రికా.. ఉగ్రభట్టి గుహ.. లంకా నగరం త్రేతాయుగం.. వారణాసి మణికర్ణిక ఘాట్.. అంటూ చూపించారు. చివర్లో మహేశ్ బాబు నంద మీద స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలంతో కనిపించారు. చివరలో ‘వారణాసి’ అనే టైటిల్ పడింది. ఈ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం విశేషం. గత కొన్నిరోజులుగా రుద్ర, వారణాసి..  సహా పలు పేర్లు వినిపించాయి. కానీ, చివరకు రాజమౌళి ‘వారణాసి’ అనే పేరును ఫిక్స్ చేశారు.

రాముడిగా కనిపించనున్న మహేష్ బాబు

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నట్లు రాజమౌళి చెప్పారు. 60 రోజుల పాటు రాముడి ఎపిసోడ్ ను షూట్ చేసినట్లు వివరించారు. తొలి రోజు ఫొటో షూట్‌ లో మహేశ్ బాబుని శ్రీరాముడిగా రెడీ చేసి ఫొటోలు తీసినట్లు చెప్పారు. మహేశ్ రాముడి గెటప్ ఫొటోని తన వాల్ పేపర్‌ గా పెట్టుకున్నట్లు వివరించారు. కానీ, ఎవరైనా చూసేస్తారేమో అనుకుని దాన్ని తీసేసినట్లు చెప్పారు. మహేశ్‌ ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటోషూట్ తీస్తుంటే తనకు గూస్ బంప్స్ వచ్చాయన్నారు. రాముడి ఎపిసోడ్ లో చాలా సబ్ ఎపిసోడ్స్ ఉన్నాయని, ఒక్కో ఎపిసోడ్.. తనతో పాటు మహేశ్ కెరీర్‌ లో మర్చిపోలేమన్నారు రాజమౌళి.

2027 సమ్మర్ లో విడుదల!

‘వారణాసి’ సినిమా విడుదల గురించి సంగీత దర్శకుడు కీరవాణి క్లారిటీ ఇచ్చారు.  సమ్మర్ 2027లో విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియాంక చోప్రా, మందాకిని పాత్రలో.. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్‌గా కనిపిస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button